ETV Bharat / sports

'రోహిత్​కు మరో మూడు ఐపీఎల్ ట్రోఫీలు' - ఐపీఎల్​లో అత్యుత్తమ కెప్టెన్​గా రోహిత్ శర్మనే

టీమిండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ.. ఐపీఎల్​లో అత్యుత్తమ సారథి అని చెప్పాడు మాజీ క్రికెటర్ గంభీర్. రిటైర్ అయ్యేలోపు మరో మూడుసార్లు విజేతగా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు.

Rohit Sharma is the best skipper in the IPL: Gautam Gambhir
ధోనీ, కోహ్లీ కాదు.. ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్ అతడే
author img

By

Published : Apr 19, 2020, 5:12 PM IST

ఐపీఎల్​లో అత్యుత్తమ కెప్టెన్ రోహిత్ శర్మనే అని అన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అతడు రిటైర్మెంట్​ తీసుకునేలోపు మరో మూడు ట్రోఫీలు సులభంగా గెలుస్తాడని అభిప్రాయపడ్డాడు.

"ఎన్నోసార్లు విజేతగా నిలిచామన్న విషయంపైనే కెప్టెన్సీ ఆధాపడి ఉంటుంది. ఇది రోహిత్​కు సరిగ్గా సరిపోతుంది. ముంబయి తరఫున సారథిగా నాలుగుసార్లు కప్పు అందుకున్నాడు"

-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ముంబయి ఇండియన్స్ విజయవంతమైన ఫ్రాంఛైజీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. 2013లోఈ జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్.. ఆ ఏడాదితో పాటు 2015, 2017, 2019లలో కప్పు తెచ్చిపెట్టాడు.

సారథిగా రోహిత్.. 104 మ్యాచుల్లో 60 గెలిచాడు. 58.65 శాతం విజయాల రేటు నమోదు చేశాడు. ఇది చూస్తుంటే అతడు కెరీర్ ముగిసేలోపు మొత్తంగా 6-7 ట్రోఫీలు సొంతం చేసుకుంటాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.​

ఇదీ చూడండి : ఐపీఎల్​ ఆల్​టైమ్​ అత్యుత్తమ సారథులు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.