ETV Bharat / sports

'వారిద్దరూ ఉండగా ఆసీస్​తో టెస్టు సిరీస్​ ప్రత్యేకం' - భారత్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. వార్నర్, స్మిత్ రాకతో వారి జట్టు బలంగా మారిందని అన్నాడు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ కాస్త డిఫరెంట్​గా ఉంటుుంది
రోహిత్ శర్మ
author img

By

Published : Apr 22, 2020, 7:27 PM IST

స్టార్ బ్యాట్స్​మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ రాకతో ఆస్ట్రేలియా జట్టు బలంగా మారిందని అన్నాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ. కంగారూ గడ్డపై ఈ ఏడాది చివర్లో జరగనున్న టెస్టు సిరీస్​ ప్రత్యేకంగా ఉండనుందని అభిప్రాయపడ్డాడు. దానికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

'న్యూజిలాండ్ సిరీస్​పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ గాయం కారణంగా అక్కడ టెస్టులు ఆడలేకపోయాను. అందుకే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కంగారూ గడ్డపై వార్నర్, స్మిత్ ఉండగా ఆడటం నిజంగా ప్రత్యేకంగా ఉండనుంది. వారి రాకతో ఆసీస్ జట్టు బలంగా మారింది. అదేవిధంగా టెస్టు ఓపెనర్​గా ఆటను ఆస్వాదిస్తున్నా' -రోహిత్ శర్మ, భారత క్రికెటర్

2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోహ్లీసేన.. 71 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ 2-1తో టెస్టు సిరీస్ చేజిక్కుంచుకుంది. ఆ సమయంలో జట్టులో వార్నర్, స్మిత్ లేరు. అంతకముందు ఏడాది(2017) దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ ఉదంతానికి పాల్పడ్డమే వారి నిషేధానికి కారణం.

ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్.. అక్టోబరు-జనవరిలో జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.