ETV Bharat / sports

'కోహ్లీ, రోహిత్​లను అడ్డుకోవడమే నాకు కీలక సవాల్​'

కోహ్లీ, రోహిత్​శర్మ లాంటి అత్యుత్తమ బ్యాట్స్​మెన్​కు, టీ20 ప్రపంచకప్​లో బౌలింగ్ చేయడమే తనకు అతి పెద్ద సవాలు అని చెప్పాడు పాకిస్థాన్ పేసర్ హరీశ్ రవూఫ్. లాక్​డౌన్ కారణంగా ఈ టోర్నీ నిర్వహణపై ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Rohit Sharma and Virat Kohli will be my biggest challenge in the T20 World cup: Haris Rauf
'టీ20 వరల్డ్​కప్​లో ఆ ఇద్దరు నాకు పెద్ద సవాల్​'
author img

By

Published : Apr 28, 2020, 12:20 PM IST

2019-20 బిగ్​బాష్​ లీగ్​లో మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు పాక్​ పేసర్​ హరీశ్​ రవూఫ్​. ఇదే జాతీయ జట్టు ఎంపికకు దగ్గర చేసింది. ఒకవేళ ప్రపంచకప్​ టీమ్​లో అతడికి చోటు దక్కితే, ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ టోర్నీలో అత్యుత్తమ బ్యాట్స్​మెన్ అయిన​ కోహ్లీ, రోహిత్​శర్మలను అడ్డుకోవడమే తనకు పెద్ద సవాల్​ లాంటిదని చెప్పాడు.

"టీ20 ప్రపంచకప్​ కోసం అన్ని దేశాల నుంచి అత్యుత్తమ ఆటగాళ్లు వస్తారు. వారికి బౌలింగ్​ వేయడం నిజంగా సవాలు లాంటిది. అత్యుత్తమ ఆటగాళ్లయిన కోహ్లీ, రోహిత్​శర్మలను అడ్డుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ​అలాంటి వారికి బౌలింగ్ చేస్తే నా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇప్పటికే బీబీఎల్​లో బాగా ఆడాను. ప్రపంచకప్​లో ఇంకా బాగా రాణిస్తానని అనుకుంటున్నా"

-హరీశ్​ రవూఫ్, పాక్​ పేసర్

గత బీబీఎల్​ సీజన్​లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు రవూఫ్. మొత్తంగా 10 మ్యాచులాడి 20 వికెట్లు పడగొట్టాడు. ​

కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతుండటం వల్ల ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టోర్నీ జరుగుతుందా? లేదా? అని క్రికెట్ అభిమానాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Rohit Sharma and Virat Kohli will be my biggest challenge in the T20 World cup: Haris Rauf
విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ

ఇదీ చూడండి : 'కోహ్లీ, డివిలియర్స్ అత్యుత్తమ బ్యాట్స్​మెన్'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.