ETV Bharat / sports

'స్వదేశంలో అనుకూల పిచ్​లు మామూలు విషయమే' - chepauk pitch

చెపాక్​ పిచ్​పై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలపై.. భారత క్రికెటర్​ రోహిత్​ శర్మ స్పందించాడు. స్వదేశంలో సొంత జట్టుకు అనుకూలంగా పిచ్​లు రూపొందించడం మామూలేనని తెలిపాడు. విదేశాలలో తమ పరిస్థితిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయరని హిట్​మ్యాన్​ ప్రశ్నించాడు.

Rohit defends Chepauk pitch, says every team has right to take home advantage
'స్వదేశంలో అనుకూలమైన పిచ్​లు మాములు విషయమే'
author img

By

Published : Feb 21, 2021, 9:46 PM IST

భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరిగిన తొలి రెండు టెస్టులకు వేదికైన.. చెపాక్ పిచ్​పై క్రికెట్​ మాజీలు చేసిన విమర్శలపై స్పందించాడు టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​ రోహిత్ శర్మ. హోం టీమ్​కు అనుకూలంగా పిచ్​లు తయారు చేయడం క్రికెట్​లో కొత్తేమీ కాదని స్పష్టం చేశాడు. మైకేల్​ వాన్​, మార్క్​ వా వంటి మాజీ ఆటగాళ్లు పిచ్​ తొలి రోజు నుంచే పిచ్ స్పిన్​కు సహకరించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్​ ఇలా వ్యాఖ్యానించాడు.

"ఇరు జట్లు ఒకే పిచ్​పై ఆడినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. పిచ్​లను ఇలా తయారు చేయొద్దని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ, ముందు నుంచి భారత్​లో ఇలాంటి పిచ్​లే ఉన్నాయి. ఏ జట్టైనా స్వదేశంలో తమకు అనుకూలంగా పిచ్​లు తయారు చేసుకుంటాయి. మేము విదేశాలకు వెళ్లినప్పుడు మా గురించి ఎవరూ ఆలోచించరు. అలాంటప్పుడు మేమేందుకు వారి గురించి ఆలోచించాలి. అన్ని చోట్ల ఒకే రకమైన పిచ్​లు తయారు చేసేలా ఒక నిబంధన పెట్టమని ఐసీసీకి చెప్పండి."

-రోహిత్​ శర్మ, భారత ఓపెనర్.

తాము పిచ్​ను పట్టించుకోమని రోహిత్​ తెలిపాడు. ఆటతో పాటు ఆటగాళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తామని పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో తెలుసుకోవాలని ప్రత్యర్థి జట్లకు సూచించాడు. ఇలాంటి పిచ్​లపై ఆడేటప్పుడు టెక్నిక్​ చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. మొతేరాలోనూ చెన్నై తరహా రూపొందించి ఉంటారని రోహిత్​ అంచనా వేశాడు.

పింక్​ టెస్టుకు నేను సంసిద్ధం..

ఇంగ్లాండ్‌తో జరగనున్న డే/నైట్ టెస్టుకు సంసిద్ధంగా ఉన్నానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. సంధ్య కాలంలో ఎంతో జాగ్రత్తగా, దృష్టిసారిస్తూ బ్యాటింగ్‌ చేయాలని తెలిపాడు.

"సంధ్య కాలంలో బ్యాటింగ్ గురించి సహచర ఆటగాళ్లు చెబుతున్నప్పుడు మాత్రమే విన్నా. నేను బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్టు ఆడాను. కానీ సంధ్య సమయంలో బ్యాటింగ్‌ చేయలేదు. అది కాస్త సవాలుగా ఉంటుంది. వాతావరణం, వెలుతురులో మార్పులు వస్తుంటాయి. అప్పుడు మరింత జాగ్రత్తగా, దృష్టిసారిస్తూ బ్యాటింగ్‌ చేయాలి. మన ఆటతీరును మనం విశ్లేషించుకోవాలి. మా బ్యాట్స్‌మెన్‌ అందరికీ ఈ సవాళ్ల గురించి తెలుసు. పరిస్థితులకు తగ్గట్లుగా మేం ఆడితే సరిపోతుంది."

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా ఓపెనర్​.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గురించి..

"ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్‌కు వెళ్తే కచ్చితంగా సంతోషిస్తాం. దానికంటే ముందు ఇంకో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. కాబట్టి మా దృష్టంతా ప్రస్తుత మ్యాచ్‌లపైనే ఉంది. మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. అయిదు రోజుల ఆటలో ఒత్తిడి, దృష్టిసారించాల్సిన అంశాలు ప్రతిరోజు మారుతుంటాయి. ఉత్తమ ప్రదర్శనలు చేస్తే వ్యక్తిగత, జట్టు లక్ష్యాల్ని సాధించవచ్చు." అని రోహిత్​ పేర్కొన్నాడు.

లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించాలంటే.. ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టుల్లో ఓటమిపాలవ్వకుండా కనీసం ఒక్క విజయం సాధించాలి.

ఇదీ చదవండి: తెవాతియా విధ్వంసం.. రెచ్చిపోయిన సూర్యకుమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.