ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో మన్కడింగ్ వివాదం చర్చనీయాంశమైంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జాస్ బట్లర్‌ను పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మన్కడింగ్ చేయడం వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మన్కడింగ్ చేసిన వ్యక్తిగా అశ్విన్ రికార్డుకెక్కాడు. అయితే ఈ విషయంపై మరోసారి స్పందించాడీ స్పిన్నర్.
తాజాగా ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు అశ్విన్. అందులో ఓ నెటిజన్ "ఈ ఐపీఎల్లో మన్కడింగ్ చేసే అవకాశమున్న ఆటగాళ్లెవరు" అని ప్రశ్నించాడు. దీనికి వెంటనే స్పందించిన అశ్విన్ "క్రీజు దాటిన వారెవరైనా" అంటూ సమాధానమిచ్చాడు.
ఈ సీజన్లో అశ్విన్ దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడిన ఈ ఆటగాడిని ఈసారి అట్టిపెట్టుకోవడానికి నిరాకరించింది ఫ్రాంచైజీ.
ఇవీ చూడండి.. 2023 నుంచి 4 రోజుల టెస్టులే..!