క్రికెట్లో హ్యాట్రిక్‌లు అరుదుగా చూస్తుంటాం. ఈ ఘనత సాధించేందుకు బౌలర్లకు ఎంతో శ్రమ అవసరం. కానీ ఆడిన తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధిస్తే ఎలా ఉంటుంది. మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో ఇలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లెఫ్టార్మ్ పేసర్ రవి రమాశంకర్ యాదవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడిన తొలి మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించాడు. వరుస బంతుల్లో యూపీ బ్యాట్స్‌మెన్ ఆర్యన్ జుయాల్, అంకిత్ రాజ్‌పుత్, సమీర్ రిజ్వీలను ఔట్ చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఉత్తరప్రదేశ్ 3 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ఈ మూడు వికెట్లు రవి యాదవ్ తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన రిసీ ఫిలిప్స్ 1939-40లో ఇలాగే తాను వేసిన తొలి ఓవర్లో హ్యాట్రిక్ సాధించినా.. అంతకుముందే అతను నాలుగు మ్యాచ్‌లు ఆడి వాటిలో బౌలింగ్ చేయలేదు. భారత్ తరఫున ఇంతకు ముందు ఏడుగురు బౌలర్లు (వీబీ రంజనే, జేఎస్ రావు, మహబూదుల్లా, సలీల్ అంకోలా, జవగల్ శ్రీనాథ్, ఎస్పీ ముఖర్జీ, అభిమన్యు మిథున్) తమ తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌లు సాధించారు.
ఇవీ చూడండి.. 100 మ్యాచ్‌లాడిన ఒకే ఒక్కడు.. క్రికెట్‌కు వీడ్కోలు