'రాజస్థాన్ రాయల్స్'..ఐపీఎల్ చూసేవారందరికి ఈ పేరు సుపరిచితమే. తాజాగా ఈ జట్టు ధరించే జెర్సీ రంగు మారింది. ఈ సీజన్ మొత్తం గులాబీ రంగు దుస్తుల్లో ఆటగాళ్లు కనిపించనున్నారు.
'మీట్ ద పింక్ డైమండ్స్..మీట్ ద న్యూ రాజస్థాన్ రాయల్స్' అంటూ తమ ట్విట్టర్లో ఈ విషయాన్ని పంచుకుంది టీం యాజమాన్యం.
Meet the Pink Diamonds of Cricket! Meet the new Rajasthan Royals. 💗#HallaBol pic.twitter.com/3rGPOl7gM5
— Rajasthan Royals (@rajasthanroyals) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Meet the Pink Diamonds of Cricket! Meet the new Rajasthan Royals. 💗#HallaBol pic.twitter.com/3rGPOl7gM5
— Rajasthan Royals (@rajasthanroyals) February 10, 2019Meet the Pink Diamonds of Cricket! Meet the new Rajasthan Royals. 💗#HallaBol pic.twitter.com/3rGPOl7gM5
— Rajasthan Royals (@rajasthanroyals) February 10, 2019
షేన్‌వార్న్ సారథ్యంలో మొదటి సీజన్లోనే కప్పును గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది రాయల్స్ జట్టు. ఆ తర్వాతా నిలకడగా మెరుగైన ప్రదర్శనలు చేస్తూ క్రికెట్ అభిమానుల మనసు గెల్చుకుంది. యువ క్రికెటర్లతో నిండిన రాయల్స్ జట్టు ఈ సీజన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాల్సిందే.
ఆటలోనే కాక వివాదాలలోనూ ఈ జట్టు ముందుంది. యాజమానులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017 సీజన్లో జట్టు నిషేధం ఎదుర్కొంది.