ప్రపంచకప్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనుంది టీమిండియా. అంతకు ముందే మాటల యుద్ధానికి తెరలేపాడు సఫారీ బౌలర్ రబాడా. భారత కెప్టెన్ కోహ్లీ ఇంకా పరిణతి చెందాలని, విమర్మల్ని స్వీకరించలేడని అన్నాడు. ఈ సంవత్సరం ఐపీఎల్లో వారిద్దరి మధ్య జరిగిన ఓ ఘటనను ఈ సందర్భంగా వెల్లడించాడు.
" ఆ రోజు మ్యాచ్లో నా బౌలింగ్లో కోహ్లీ బౌండరీ కొట్టాడు. అనంతరం నన్ను విమర్శించాడు. తిరిగి అతడిని ఓ మాటంటే తీసుకోలేకపోయాడు. అతడు అద్భుతమైన క్రికెటర్ కానీ విమర్శల్ని స్వీకరించే గుణం లేదు."
-కగిసో రబాడా, దక్షిణాఫ్రికా బౌలర్
2018లో రబాడాను వెనక్కునెట్టి.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని కోహ్లీ దక్కించుకున్నాడు.
"అది అత్యుత్తమ గౌరవం. కోహ్లి దానికి అర్హుడే. గత ఐదేళ్లలో టీమిండియా తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడిని తప్పు పట్టలేం. నీకు సరైన దారిలో ఆ అవార్డు వస్తే నేను నిజంగా సంతోషిస్తున్నా"
-కగిసో రబాడా, దక్షిణాఫ్రికా బౌలర్