ETV Bharat / sports

పింక్ టెస్టు విజయం: టీమ్ఇండియాకు కలిసొచ్చిన అంశాలు!

author img

By

Published : Feb 26, 2021, 10:58 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. రెండు రోజుల్లోనే మ్యాచ్​ను ముగించి విమర్శలూ మూటగట్టుకుంది. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నా.. ఈ మ్యాచ్​లో భారత్​కు కొన్ని అంశాలు మాత్రం సానుకూలంగా కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

positives for India from the 3rd Test against England
పింక్ టెస్టు విజయం

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. భారత్​కు కలిసొచ్చే స్పిన్ పిచ్​ను నమ్ముకుని గెలుపు కైవసం చేసుకుని ప్రపంచ ఛాంపియన్ షిప్​ ఫైనల్​కు మార్గం మరింత తేలిక చేసుకుంది. మొదటి టెస్టులో ఓడిన తర్వాత పంథా మార్చుకున్న భారత జట్టు ఆటగాళ్ల ఎంపిక, పిచ్ సెలక్షన్ వంటి అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని విజయాల బాట పట్టింది. సిరీస్​లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మూడో మ్యాచ్​లోనూ టీమ్ఇండియా విజయంలో కొన్ని అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

1. జట్టు ఎంపిక, బౌలింగ్ విభాగం

విరాట్ కోహ్లీ సారథ్యంలో జట్టు ఎంపిక సరిగా లేదంటూ చాలాసార్లు విమర్శలు వచ్చాయి. అలాగే బౌలింగ్ ప్రణాళికలూ బాగాలేవంటూ మాజీలు మాట్లాడారు. కానీ ఈ మ్యాచ్​లో ఈ రెండు అంశాలపై పట్టు ప్రదర్శించారు కోహ్లీ, మేనేజ్​మెంట్.

ఇందులో మొదటిది కుల్దీప్ యాదవ్​ స్థానంలో వాషింగ్టన్ సుందర్​ను తీసుకోవడం. ఈ నిర్ణయం జట్టుకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్​లో ఇతడు కేవలం ఒకే వికెట్ తీసుకున్నా.. బ్యాటింగ్ లైనప్ కాస్త బలంగా కనిపించింది. ఈ మ్యాచ్​లో ఇతడికి బౌలింగ్ వేసే అవకాశం రాకపోయినా.. ఒకే ఓవర్ వేసిన సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

బంతితోనూ టీమ్ఇండియా ప్రణాళిక చాలా బాగుంది. పిచ్​ వైవిధ్యాన్ని గుర్తించిన స్పిన్నర్లు బంతిని నేరుగా వికెట్లపైకి విసురుతూ ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్​ను ఇబ్బందిపెట్టారు. అలాగే ఫీల్డింగ్ పొజిషన్​ కూడా చక్కగా కుదిరింది. బంతితో చక్కటి ప్రణాళికలతో బరిలో దిగిన టీమ్ఇండియా.. తర్వాత మ్యాచ్​లోనూ ఇలాగే దూకుడుగా వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.

team india
టీమ్ఇండియా

2. రోహిత్ ఫామ్

రెండో టెస్టు జరిగిన చెన్నై, మూడో టెస్టు జరిగిన మోదీ పిచ్​లు బ్యాటింగ్​కు ఏమాత్రం అనువుగా లేవంటూ ప్రత్యర్థి జట్టు ఆరోపించింది. కానీ ఇవే పిచ్​లపై అటు టీమ్ఇండియా, ఇటు ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ ఇబ్బందిపడుతున్న వేళ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్​తో అలరించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారీ శతకం(161)తో ఆకట్టుకున్న హిట్​మ్యాన్.. రెండో ఇన్నింగ్స్​లో కీలక పరుగులు సాధించాడు. అలాగే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అద్భుత అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. స్వీప్ షాట్లు, ఫుట్​వర్క్ విషయంలో మెరుగ్గా కనిపించిన రోహిత్.. అత్యుత్తమంగా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు.

rohit
రోహిత్ శర్మ

బెంచ్ స్ట్రెంత్

కరోనా కారణంగా అందరూ ఫిట్​నెస్ సమస్యలతో బాధపడుతోన్న వేళ టీమ్ఇండియా మాత్రం తన బెంచ్ స్ట్రెంత్​ను పెంచుకుంది. గాయాల కారణంగా ఒక్కో ప్రధాన ఆటగాడు వైదొలుగుతుంటే..ఒక్కో ఆణిముత్యం బయటకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​తో పాటు ఇంగ్లాండ్​తో జరుగుతోన్న ఈ సిరీస్​లో కొత్త ఆటగాళ్ల ప్రదర్శన టీమ్ఇండియాకు పెద్ద సానుకూలాంశం. అలా ఈ మ్యాచ్​లో చెప్పుకోదగిన ఆటగాడు అక్షర్ పటేల్. సొంత మైదానంలో చెలరేగిపోయిన ఇతడు 11 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఇంతకుముందు ఒక్క టెస్టు మ్యాచ్​ కూడా ఆడని ఆటగాడు.. ఆడిన రెండు మ్యాచ్​ల్లో 18 వికెట్లు సాధించడం చూస్తే భారత జట్టు అమ్ములపొదిలో ఎన్ని అస్త్రాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Axar
అక్షర్ పటేల్

ఇవీ చూడండి: 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'... స్పిన్ పిచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.