ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన 'బుష్ఫైర్ క్రికెట్ బాష్'లో దిగ్గజ క్రికెటర్లు అలరించారు. అప్పటి ఫామ్, ఆ చురుకుదనం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇందులో రికీ పాంటింగ్ ఎలెవన్, గిల్‌క్రిస్ట్ ఎలెవన్ జట్లు తలపడగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్, టిమ్ పైన్ ఇరుజట్లకు కోచ్‌లుగా వ్యవహరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాంటింగ్ జట్టు 10 ఓవర్లలో 104 రన్స్ చేసింది. ఛేదనలో గిల్లీ జట్టు 103 పరుగులకు పరిమితమైంది.
గిల్‌క్రిస్ట్ అదే జోరు..
ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఛేదనలో అదరగొట్టేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇతడు.. 9 బంత్లులో 2 ఫోర్లు, 1 సిక్సర్ సాధించి 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ల్యూక్ హడ్జ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వాట్సన్ 30(9 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
-
GILLY! 💥
— cricket.com.au (@cricketcomau) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Donate to the #BigAppeal here: https://t.co/HgP8Vhnk9s pic.twitter.com/eHqOhbiC9y
">GILLY! 💥
— cricket.com.au (@cricketcomau) February 9, 2020
Donate to the #BigAppeal here: https://t.co/HgP8Vhnk9s pic.twitter.com/eHqOhbiC9yGILLY! 💥
— cricket.com.au (@cricketcomau) February 9, 2020
Donate to the #BigAppeal here: https://t.co/HgP8Vhnk9s pic.twitter.com/eHqOhbiC9y
గిల్లీ జట్టులో బరిలోకి దిగిన యువీ 2(5 బంతుల్లో) నిరాశపర్చాడు. సైమండ్స్ మాత్రం చితక్కొట్టి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 13 బంతుల్లో 29 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కేమరూన్ స్మిత్(5), రైవోల్ట్(9) అజేయంగా నిలిచారు.
-
Wasim Akram gets rugby legend Cameron Smith bowing with shades on, but first-ball wickets don't count... Smith bats onpic.twitter.com/oxASbEIMod
— ESPNcricinfo (@ESPNcricinfo) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wasim Akram gets rugby legend Cameron Smith bowing with shades on, but first-ball wickets don't count... Smith bats onpic.twitter.com/oxASbEIMod
— ESPNcricinfo (@ESPNcricinfo) February 9, 2020Wasim Akram gets rugby legend Cameron Smith bowing with shades on, but first-ball wickets don't count... Smith bats onpic.twitter.com/oxASbEIMod
— ESPNcricinfo (@ESPNcricinfo) February 9, 2020
పాంటింగ్ జట్టు బౌలర్లలో బ్రెట్‌లీ రెండు వికెట్లు సాధించాడు. అప్పటి పేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఫవద్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. పాక్ దిగ్గజం వసీం అక్రమ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
లారా-పాంటింగ్ అదుర్స్...
తొలుత బ్యాటింగ్ చేసిన పాంటింగ్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 రన్స్ చేసింది. లారా 30 పరుగులు(11 బంతుల్లో; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పాంటింగ్ 26( 14 బంతుల్లో; 4 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడుగా మాథ్యూ హెడెన్ 16(14 బంతుల్లో; 1 ఫోర్, 1 సిక్సర్), లిచ్‌ఫీల్డ్(9), జస్టిన్ లాంగర్(6), అలెక్స్ బ్లాక్వెల్(2*), ల్యూక్ హోగ్డే(11*) మంచి ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో 4 పరుగులు వైడ్ల రూపంలో వచ్చాయి.
-
Brian Lara's still got it. 😍 #BushfireCricketBash pic.twitter.com/DagbAhnlt6
— Trendulkar (@Trendulkar) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Brian Lara's still got it. 😍 #BushfireCricketBash pic.twitter.com/DagbAhnlt6
— Trendulkar (@Trendulkar) February 9, 2020Brian Lara's still got it. 😍 #BushfireCricketBash pic.twitter.com/DagbAhnlt6
— Trendulkar (@Trendulkar) February 9, 2020
గిల్‌క్రిస్ట్ జట్టు బౌలర్లలో కోర్ట్నే వాల్ష్, యువరాజ్ సింగ్, ఆండ్రూ సైమండ్స్ తలో వికెట్ తీసుకున్నారు.
విరామంలో సచిన్ దూకుడు...
తొలి బ్యాటింగ్ అనంతరం బ్రేక్ సమయంలో బ్యాట్‌తో అలరించాడు భారత దిగ్గజం సచిన్. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్ పెర్రీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 6 బంతులు ఆడి అజేయంగా నిలిచిన సచిన్.. ఈ మ్యాచ్‌లో పాంటింగ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
-
Sachin starts with a boundary 🤩 #BushfireCricketBash pic.twitter.com/b4yqYDpOAz
— Manak Gupta (@manakgupta) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sachin starts with a boundary 🤩 #BushfireCricketBash pic.twitter.com/b4yqYDpOAz
— Manak Gupta (@manakgupta) February 9, 2020Sachin starts with a boundary 🤩 #BushfireCricketBash pic.twitter.com/b4yqYDpOAz
— Manak Gupta (@manakgupta) February 9, 2020
దిగ్గజాలతో 16 ఏళ్ల అమ్మాయి..
ఈ మ్యాచ్‌లో దిగ్గజాలతో 16 ఏళ్ల అమ్మాయి బరిలోకి దిగింది. బిగ్‌బాష్ లీగ్‌లో రాణించిన ఫోబే లిచ్‌ఫీల్డ్‌కు మాజీలతో ఆడే ఛాన్స్ దక్కింది. పాంటింగ్ జట్టు తరఫున బ్యాటింగ్ చేసిన ఈ చిన్నారి... 9 పరుగులు చేసింది.