ETV Bharat / sports

అండర్​-19 ప్రపంచకప్ జట్టు నుంచి నసీమ్​ షా తొలగింపు - Naseem U-19 team

పాక్ యువ బౌలర్ నసీమ్​ షాను అండర్-19 ప్రపంచకప్​ జట్టు నుంచి తొలగించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అతడు అంతర్జాతీయ క్రికెటర్​గా నిరూపించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

PCB withdraws teenage sensation Naseem Shah from U-19 World Cup squad
నసీమ్ షా
author img

By

Published : Jan 1, 2020, 4:27 PM IST

ఇటీవలే దక్షిణాఫ్రికా, శ్రీలంక పర్యటనల్లో అద్భుత బౌలింగ్​తో సత్తాచాటిన పాకిస్థాన్ యువ సంచలనం నసీమ్ షాకు అండర్-19 ప్రపంచకప్​ జట్టు నుంచి తొలగించింది ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) . అంతర్జాతీయ జట్టులో కొనసాగించాలనే ఉద్దేశంతో కావాలనే అతడిని జూనియర్ జట్టుకు ఎంపికచేయలేదని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ చెప్పాడు.

"అత్యుత్తమ గణాంకాలతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు నసీమ్​. అంతర్జాతీయ క్రికెటర్​గా కొనసాగించాలనే అతడిని అండర్-19 జట్టు నుంచి తొలగించాం. సీనియర్ జట్టులో అతడు ఇంకా నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం పాక్ జాతీయ జట్టులో సభ్యుడిగా ఉన్న నసీమ్.. బౌలింగ్ కోచ్ వకార్ పర్యవేక్షణలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటున్నాడు. త్వరలో స్వదేశంలో జరగనున్న బంగ్లాదేశ్​తో సిరీస్​కు అందుబాటులో ఉండనున్నాడు." - వసీం ఖాన్, పీసీబీ సీఈఓ

ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఒక్కో మ్యాచ్​లో మూడు వికెట్ల చొప్పున తీసి ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో సిరీస్​లో 7 వికెట్లతో సత్తాచాటాడు. ఈ నెలలో సొంతగడ్డపై బంగ్లాదేశ్​తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది పాకిస్థాన్.

ఇదీ చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్​గా ధోనీ, టెస్టులకు కోహ్లీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.