తానున్నది టీవీ షోలలో కూర్చొనేందుకు కాదని పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించాడు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. తనను క్రికెట్కు సేవలందించే అవకాశం కల్పించాలని అన్నాడు. బీసీసీఐ అధ్యక్షడు సౌరభ్ గంగూలీ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
తన సహచరులైన రాహుల్ ద్రవిడ్.. భారత జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు, గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడని అన్నాడు అక్తర్. అయితే తనను టీవీ షోలలో కూర్చోపెట్టకుండా, క్రికెట్లో సేవలందించే అవకాశం కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
టీవీ షోల్లో కూర్చోవడం నా పని కాదు
"సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు, రాహుల్ ద్రవిడ్, భారత జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును చూసుకుంటున్నాడు. మార్క్ బౌచర్ ఆ దేశ జట్టుకు ప్రధాన కోచ్, కానీ పాకిస్తాన్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వారు నన్ను ఉపయోగించుకోవట్లేదు. నా పని టీవీ షోలలో కూర్చోవడం కాదు, క్రికెట్కు సేవలందించేందుకు అనుమతించాలి" అని అక్తర్ అన్నాడు.
ఇదీ చూడండి.. 'కరోనాతో నా కెరీర్లో భిన్నమైన అనుభవం ఎదురైంది'