త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది పాకిస్థాన్ జట్టు. అక్కడ మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఈ టూర్‌కు ముందు కొత్త కోచ్‌లను నియమించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. బ్యాటింగ్ కోచ్‌గా యూనిస్ ఖాన్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముస్తాక్ అహ్మద్‌ల పేర్లు ప్రకటించింది.
"యూనిస్ లాంటి అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభ కలిగిన వ్యక్తి.. పాక్ పురుషుల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ముస్తాక్ స్పిన్నర్లకు టెక్నిక్‌లు నేర్పించడం, మ్యాచ్ ప్లానింగ్ తదితర విషయాల్లో పాక్ క్రికెట్ కోచ్ మిస్బాకు సాయంగా ఉంటారు."
-వసీం ఖాన్, పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
యూనిస్ ఖాన్ 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు చేశాడు. కెరీర్లో 313 పరుగుల వ్యక్తిగత అత్యుత్తమాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. పాక్ తరఫున 52 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 185 వికెట్లు తీసిన మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్.. జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరించనున్నాడు. గతంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.
ఇదీ చూడండి:'ధోనీ.. నీ కెరీర్‌కు ముగింపు పలుకుతాడు'