ETV Bharat / sports

ఇంగ్లాండ్​ పర్యటనకు పాకిస్థాన్​ సిద్ధం.. రేపే పయనం - COVID CASES PAKISTHAN CRICKET NEWS

ఇంగ్లాండ్​ పర్యటనకు పయనమయ్యేందుకు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు సిద్ధమైంది.​ మొత్తం 20 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది ఇంగ్లీష్​ జట్టుతో తలపడేందుకు ఆదివారం బయలుదేరనున్నట్లు పీసీబీ తెలిపింది.

Pakistan to leave for UK on Sunday, 6 out of 10 infected players test negative
ఇంగ్లాండ్​ పర్యటనకు పాకిస్థాన్​ సిద్ధం
author img

By

Published : Jun 27, 2020, 9:34 PM IST

ఇంగ్లాండ్​ గడ్డపై జరిగే టెస్టు, టీ20 సిరీస్​లో తలపడేందుకు పాకిస్థాన్ జట్టు సిద్ధమైంది. మొత్తం 20 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందితో కూడిన బృందం ఆదివారం ఇంగ్లాండ్​​కు బయలుదేరుతుందని ​ఆ దేశ క్రికెట్​ బోర్డు(పీసీబీ) తెలిపింది. తాజాగా, కరోనా వైరస్​ సోకిన 10 మంది క్రికెటర్లకు రెండోసారి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి నెగిటివ్​ నిర్ధరణ అయ్యింది. వీరు లేకుండానే మిగతా బృందం ఇంగ్లాండ్​కు వెళ్లబోతుంది.

అదనపు ఆటగాళ్లలో ఫాస్ట్​ బౌలర్​ ముసా ఖాన్​, వికెట్​ కీపర్​ రోహైల్​ నజీల్​లకూ నెగిటివ్​గా తేలినట్లు పీసీబీ​ వెల్లడించింది. ఈ క్రమంలోనే వారు కూడా జట్టుతో కలిసి వెళ్లనున్నట్లు తెలిపింది.

గతంలో పాజిటివ్​గా తేలిన 10 మంది ఆటగాళ్లకు.. మరో రెండుసార్లు పరీక్షలు చేసి నెగిటివ్​ నిర్ధరణ అయిన తర్వాతనే వారిని ఈ పర్యటనకు పంపించనున్నట్లు పీసీబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండో పరీక్షల్లో నెగిటివ్​ నిర్ధరణ అయిన ఆటగాళ్లకు మూడో దశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

ఈ 10 మంది ఆటగాళ్లలో ఫకర్​ జమాన్​, మహ్మద్​ హస్నైన్​, మహ్మద్​ హఫీజ్​, మహ్మద్​ రిజ్వాన్​, షాదాబ్​ ఖాన్​, వాహబ్​ రియాజ్​​లకు రెండోసారి పరీక్షల్లో ఫలితం నెగటివ్​గా వచ్చింది. హైదర్​ అలీ, హరిస్​ రౌఫ్​, కాశిఫ్ భట్టి, ఇమ్రాన్​ ఖాన్​లతో పాటు మలంగ్​ అలీకి రెండోసారీ పాజిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి.. 'సచిన్.. మరెన్నో తరాలకు మీరు స్ఫూర్తిగా నిలవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.