ETV Bharat / sports

ఐపీఎల్ కన్నా ప్రపంచకప్ ముఖ్యం: బోర్డర్ - అలెన్ బోర్డర్ వార్తలు

టీ20 ప్రపంచకప్​ జరగాల్సిన సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే తాను ఒప్పుకోనని అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్ బోర్డర్. డబ్బు కోసమే ఐపీఎల్ నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు.

బోర్డర్
బోర్డర్
author img

By

Published : May 22, 2020, 8:32 PM IST

అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఒకవేళ అప్పుడు ఐపీఎల్‌ నిర్వహిస్తే ఇతర బోర్డులు తమ ఆటగాళ్లను అనుమతించొద్దని ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్‌ బోర్డర్‌ అన్నారు. స్థానిక లీగ్‌ టోర్నీల కన్నా ప్రపంచకప్పే ముఖ్యమని ఆయన చెప్పారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇటీవల అన్ని క్రీడలూ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్‌తో పాటు ఈ వేసవిలో భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్‌-13వ సీజన్‌ కూడా వాయిదా పడింది. అయితే, అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ నిర్వహించే అవకాశాలున్నాయని ఇటీవల వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచకప్‌ కన్నా ఐపీఎల్‌ ముఖ్యం కాదని బోర్డర్‌ తెలిపారు.

"ప్రపంచకప్‌ నిర్వహించాల్సిన వేళ ఐపీఎల్‌ కొనసాగిస్తే నేను ఒప్పుకోను. స్థానిక లీగ్‌ కన్నా ప్రపంచకప్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ అలా జరగకపోతే ఐపీఎల్‌ కూడా జరగొద్దు. నిజంగా అక్టోబర్‌-నవంబర్‌ సీజన్‌లో ఐపీఎల్‌ ఆడించాలనే నిర్ణయం తీసుకుంటే నేను ప్రశ్నిస్తా. డబ్బు కోసమే ఐపీఎల్‌ నిర్వహిస్తున్నారు.. నిజం కాదా?. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌కు బదులు ఐపీఎల్‌ నిర్వహించాలని చూస్తే.. ఇతర బోర్డులు తమ ఆటగాళ్లను అనుమతించొద్దు" అని బోర్డర్‌ చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.