ETV Bharat / sports

ధోనీ రనౌట్.. నిరాశలో కోట్లాది భారతీయులు - MS Dhoni run out in 2019 world cup

ప్రపంచకప్​ సెమీఫైనల్​లో భారత్​ ఓటమిపాలై ఏడాది గడిచింది. ఆరోజు కేవలం రెండు అంగుళాల దూరంతో రనౌట్​ అయిన ధోనీ.. కోట్లాది మంది భారతీయులను నిరాశలో ముంచాడు. అప్పటి నుంచి మైదానంలో మహీ కనిపించకపోవడం వారిని మరింత బాధ కలిగిస్తున్న అంశం.

ధోనీ రనౌట్.. నిరాశలో కోట్లాది భారతీయులు
ధోనీ
author img

By

Published : Jul 10, 2020, 4:44 PM IST

Updated : Jul 10, 2020, 5:54 PM IST

టీమ్‌ఇండియా కష్టాల్లో ఉన్న ఎన్నోసార్లు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. బ్యాట్స్‌మన్‌ అంతా పెవిలియన్‌ చేరినా టెయిలెండర్లతో కలిసి విజయాలు అందించాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ గెలిపిస్తాడని అంతా భావించారు. కానీ అది జరగలేదు. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును విజయానికి చేరువ చేసినా ఆఖర్లో ఇద్దరూ ఔటయ్యారు. దీంతో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరీ ముఖ్యంగా ధోనీ రనౌట్‌‌ అయ్యాక కోట్లాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అదే రోజు మహీ చివరిసారి మైదానంలో కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఆ సెమీస్‌ జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒకసారి ఆ విశేషాల్ని గుర్తుచేసుకుందాం.

World Cup 2019
న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్​ సెమీఫైనల్​లో ధోనీ

కివీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు..

గతేడాది జులై 9న తొలుత టాస్‌ గెలిచిన విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వరుణుడు అడ్డంకిగా మారిన ఆ మ్యాచ్‌ రెండు రోజుల పాటు జరగ్గా న్యూజిలాండ్‌ తొలి రోజు 46.1 ఓవర్లలో 211/5తో నిలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను మరుసటి రోజుకు వాయిదా వేశారు. దీంతో తర్వాతి రోజు ఆ జట్టు మిగిలిన ఓవర్లు పూర్తి చేసి 239-8 స్కోర్‌ సాధించింది. అంతకుముందు రోజు విలియమ్సన్‌(67), రాస్‌ టేలర్‌(74) ఆదుకోవడంతో ఆ జట్టు పోరాడే స్కోర్‌ సాధించింది. భువనేశ్వర్‌(3) వికెట్లు తీయగా మిగతా బౌలర్లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

World Cup 2019
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్​(పాత ఫొటో)

తడబడిన భారత బ్యాట్స్‌మన్‌..

రెండో రోజు స్వల్ప లక్ష్యమే ఛేదించాల్సి రావడంతో అంతా భారత విజయం ఖాయమనుకున్నారు. కానీ ఆట మొదలైన గంటలోపే టాప్‌ ఆర్డర్‌ మొత్తం పెవిలియన్‌ చేరింది. మరీ ముఖ్యంగా రాహుల్‌(1), రోహిత్‌ (1), కోహ్లీ(1) పూర్తిగా విఫలమయ్యారు. తర్వాత రిషభ్‌పంత్(32), హార్దిక్‌ పాండ్య(32) ఆదుకునే ప్రయత్నం చేసినా కివీస్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. దీంతో భారత్‌ 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. అప్పుడే ధోనీ(50), రవీంద్ర జడేజా(77) అర్ధశతకాలతో రాణించారు. ప్రపంచకప్‌ చరిత్రలో ఏడో వికెట్‌కు అద్భుతమైన 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇక భారత విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో భారీ షాట్‌ ఆడబోయిన జడేజా విలియమ్సన్‌ చేతికి చిక్కాడు. వెంటనే ధోనీ సైతం గప్తిల్‌ విసిరిన ఓ త్రోకు రనౌ‌టయ్యాడు. దీంతో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. వారంతా నిరాశ చెందారు. మైదానం మూగబోయింది. చివరికి భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది. అలా కోహ్లీసేన సెమీస్‌ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఐసీసీ నేడు ఒక ట్వీట్‌ చేసింది. నాటి మ్యాచ్‌ హైలెట్స్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది.

World Cup 2019
టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

Last Updated : Jul 10, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.