టీమిండియా మాజీ క్రికెటర్స్ సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ నోటీసులు అందించింది. క్రికెట్ సలహా మండలిలో సభ్యులుగా ఉంటూ ఐపీఎల్లో మెంటార్స్‌గా పనిచేయడంపై బీసీసీఐ ఆగ్రహాం వ్యక్తం చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంతో వీరికి నోటీసులిచ్చారు అంబుడ్స్‌మెన్. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
సచిన్ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టుకు, లక్ష్మణ్ సన్‌రైజర్స్‌కు మెంటార్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీరికే కాకుండా గంగూలీకి గతంలో నోటీసులు అందాయి. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా, క్రికెట్ సలహా మండలిలో సభ్యుడిగా, ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడీ మాజీ టీమిండియా కెప్టెన్.
"గంగూలీకి నోటీసు అందింది. దీంతోపాటు సచిన్, లక్ష్మణ్‌కూ నోటీసులందాయి. కానీ వీరిలో మెంటార్‌గా, సలహా మండలిలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నందుకు గానూ సచిన్ ఎటువంటి డబ్బు తీసుకోవడం లేదు. స్వచ్ఛందంగానే సేవలు అందిస్తున్నారు" - బీసీసీఐ
ఏప్రిల్ 28 లోపు రాత పూర్వక సమాధానాన్ని తెలిపాలని జస్టిస్ జైన్ స్పష్టం చేశారు.