ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో చైనాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ తుదిపోరుకు అర్హత సాధించింది. నేడు జరగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు జపాన్‌తో భారత అమ్మాయిలు తలపడనున్నారు.
ఆరంభంలో మంచి స్థితిలో ఉన్న టీమిండియా అనంతరం ఒత్తిడికి లోనైంది. వెంటనే పుంజుకుని చైనీస్ డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచింది. రెండో క్వార్టర్లో ఎటాకింగ్ చేసిన భారత అమ్మాయిలు 17వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. గుర్జీత్ ప్రయత్నించినప్పటికీ ప్రతర్థి జట్టు అవకాశమివ్వలేదు.
చివర్లో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆట రెండు నిమిషాల్లో ముగుస్తుందనుకున్న తరుణంలో చైనాకు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయితే భారత ఢిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది డ్రాగన్ జట్టు. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గోల్ నమోదు కాకుండానే డ్రాగా ముగిసింది.
ఇప్పటికే పురుషుల హాకీ జట్టు ఫైనల్ చేరింది. మంగళవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3 తేడాతో గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై తలపడనుంది.
ఇది చదవండి: హాకీ: జపాన్‌పై విజయం.. ఫైనల్‌కు భారత్