ETV Bharat / sports

ప్రేక్షకులు లేకుండానే కివీస్​-ఆసీస్​ టీ20లు - Auckland

కివీస్​-ఆసీస్​ మధ్య జరగనున్న తదుపరి రెండు టీ20లకు ప్రేక్షకులకు అనుమతి నిరాకరించింది న్యూజిలాండ్​ క్రికెట్ బోర్డు. మరోసారి కొవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది బోర్డు. చివరి టీ20పై తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.​

NZ vs Aus: Third and fourth T20I to be played behind closed doors
ప్రేక్షకులు లేకుండానే కివీస్​-ఆసీస్​ టీ20లు
author img

By

Published : Feb 27, 2021, 4:21 PM IST

Updated : Feb 27, 2021, 5:57 PM IST

న్యూజిలాండ్​-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తదుపరి రెండు టీ20 మ్యాచ్​లకు ప్రేక్షకులకు అనుమతి నిషేధించింది కివీస్​ క్రికెట్ బోర్డు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరోసారి అధికమవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ మహిళా జట్ల మధ్య జరగనున్న తొలి రెండు టీ20లకు కూడా అభిమానులను రావొద్దని కోరింది.

ఈ మ్యాచ్​లు ఆక్లాండ్​లో జరగాల్సి ఉండగా.. వాటి వేదికను వెల్లింగ్టన్​కు మార్చింది బోర్డు. ఐదో టీ20, మహిళల మూడో టీ20కి సంబంధించి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.

దేశవ్యాప్తంగా కొవిడ్​ రెండో దశ కొనసాగుతుండగా.. ఆక్లాండ్​లో వైరస్​ తీవ్రత మూడో దశలో ఉందని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్​ తెలిపారు. దీంతో ఆక్లాండ్​లో ఎటువంటి క్రీడలు నిర్వహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్​ విజయం సాధించింది. 5 మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 2-0 ఆధిక్యంలో నిలిచింది ఆతిథ్య జట్టు. మార్చి 3న మూడో టీ20, మార్చి 5న నాల్గో టీ20 జరగాల్సి ఉంది.

ఇదీ చదవండి: సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు భారత మహిళా జట్లు ఇవే

Last Updated : Feb 27, 2021, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.