ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను పొడిగించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. తద్వారా ఇప్పటికే కరోనా వల్ల రద్దయిన ఎనిమిది టెస్టు మ్యాచ్‌లను మళ్లీ నిర్వహించేందుకు మార్గం సుగుమం అవుతందని తెలిపింది. లేదంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెనకపడే అవకాశం ఉందని వెల్లడించింది.
"ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ షెడ్యూల్‌ను పొడిగించాలి లేదా సవరించాలి. లేదంటే కరోనా వల్ల రద్దయిన ఎనిమిది టెస్టు మ్యాచ్‌లను నిర్వహించడానికి కుదరదు. అలా అయితే కొన్ని జట్లు నష్టపోతాయి. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నాం."
-బీసీబీ
పాకిస్థాన్‌తో వారి గడ్డపై ఓ టెస్టుతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా(2), న్యూజిలాండ్(2), శ్రీలంక(3)తో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రణాళిక ప్రకారం రెండేళ్ల వ్యవధిలో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో తొమ్మిది జట్లు చెరో 6 టెస్టు సిరీస్‌లు ఆడాలి. స్వదేశంలో మూడు,విదేశీ గడ్డపై మరో మూడు సిరీస్‌ల్లో తలపడాలి.
ఇది చూడండి : కోహ్లీతో పోరులో నేనే గెలుస్తా: చాహల్