కాంట్రాక్టు క్రికెటర్లకు శిక్షణా శిబిరాలను నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరింత సమయం తీసుకోనుంది. లాక్డౌన్ నాల్గొవ దశలో కేంద్రం జారీ చేసిన మార్గనిర్దేశకాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్లు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆటగాళ్లకు వ్యక్తిగత శిక్షణ ప్రారంభించాలని బీసీసీఐ అనుకుంటోంది.
"మే 31 వరకు విమాన ప్రయాణంపై ఉన్న ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని.. కాంట్రాక్ట్ ఆటగాళ్లకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి మరికొంత సమయం వేచి చూస్తాం. క్రికెట్ కార్యకలాపాలన్నీ ప్రారంభించే ముందు కేంద్రం జారీ చేసిన నిబంధనలను అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వస్తాం".
--అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మూడు వేల మరణాలు సంభవించగా.. 95 వేల మందికి పైగా వైరస్ ప్రభావితులు ఉన్నారు.
ఇదీ చూడండి.. 'నేను ఫిట్‌గా తయారవ్వడానికి కారణం అతడే'