ETV Bharat / sports

'ఐపీఎల్​లో రాణిస్తేనే ధోనీ జట్టులోకి' - Dhoni IPL

టీ20 ప్రపంచకప్​కు సమయం దగ్గరపడుతోంది. ఇందుకోసం జట్టును సిద్ధం చేసే పనిలో పడింది సెలక్షన్ కమిటీ. అయితే మాజీ సారథి ధోనీ భవితవ్యంపైనా ఆలోచిస్తోంది. అతడు ఐపీఎల్​లో మంచి ప్రదర్శన చేస్తేనే జట్టులోకి వస్తాడని కొత్తగా ఎంపికైన సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సునీల్ జోషి తెలిపారు.

ధోనీ
ధోనీ
author img

By

Published : Mar 9, 2020, 4:55 PM IST

మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ జట్టులోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతాడా అని చూస్తున్నారు. ఈనెలలో ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా అందుకోసం అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు మహీ. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఐపీఎల్​లో ప్రదర్శనే అతడు మళ్లీ జట్టులోకి రావడానికి ఉపయోగపడతుందని కొత్తగా నియామకమైన సెలక్షక కమీటీ తెలిపింది.

టీమిండియాకు కొత్త సెలక్షన్ కమిటీ ఛైర్మన్​గా ఎన్నికైన సునీల్ జోషి నాయకత్వంలో తొలిసారి కమిటీ సమావేశమైంది. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్​కు జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంలో ధోనీ భవితవ్యంపైనా స్పష్టతనిచ్చాడు జోషి.

"దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు ధోనీని పరిగణలోకి తీసుకోలేదు. ఐపీఎల్​లో మంచి ప్రదర్శన చేస్తేనే అతడిని జట్టులోకి తీసుకుంటాం. ధోనీనే కాదు ఇంకా చాలా మంది సీనియర్, జూనియర్ క్రికెటర్లు ఐపీఎల్​లో పాల్గొంటున్నారు. మంచి ప్రదర్శన చేస్తే వారు కూడా జట్టులోకి వస్తారు. కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలూ ఉండొచ్చు. " '

-సునీల్ జోషి, టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్

ఈ ఏడాది అక్టోబర్​లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే జట్టును సన్నద్ధం చేస్తోంది సెలక్షన్ కమిటీ. కొత్త కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలివ్వాలని భావిస్తోంది. అయితే ఐపీఎల్​లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లనూ పరిగణలోకి తీసుకుంటామని సెలక్షన్ కమిటీ చెప్పినందున.. ఎవరు అవకాశం దక్కించుకుంటారో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.