ETV Bharat / sports

అబుదాది టీ10 లీగ్​లో పూరన్ సిక్సుల మోత - నికోలస్ పూరన్ రికార్డు హాఫ్ సెంచరీ

అబుదాబి టీ10 లీగ్​లో నార్తర్న్ వారియర్స్ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా టైగర్స్​తో జరిగిన మ్యాచ్​లో 26 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు.

Nicholas Pooran smashes 12 sixes in Abudhabi T10 league
అబుదాది టీ10 లీగ్​లో పూరన్ ఊచకోత
author img

By

Published : Feb 1, 2021, 2:39 PM IST

అబుదాబి టీ10 లీగ్​లో నార్తర్న్ వారియర్స్ బ్యాట్స్​మన్ నికోలస్ పూరన్ సునామీ సృష్టించాడు. బంగ్లా టైగర్స్​తో జరిగిన మ్యాచ్​లో 26 బంతుల్లోనే 89 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన నార్తర్న్ వారియర్స్​కు శుభారంభం లభించింది. ఓపెనర్ వసీమ్ మహమ్మద్ తొలి ఓవర్లలోనే రెండు సిక్సులు బాదాడు. ఫలితంగా మొదటి ఓవర్లోనే 17 పరుగులు రాబట్టుకుంది జట్టు. అయితే 12 పరుగులు చేసిన తర్వాత వసీం ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సిక్స్​తో ఖాతా తెరిచాడు. తర్వాత సిమ్మన్స్ కూడా సిక్స్ సాధించడం వల్ల ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.

తర్వాత పూరన్​ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు రాబట్టాడు. ఇతడి ధాటికి బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. సిక్సులే టార్గెట్​గా రెచ్చిపోయిన ఇతడు 26 బంతుల్లోనే 89 పరుగులు చేసి కరీమ్ జనత్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్​లో ఇతడు 3 ఫోర్లతో పాటు 12 సిక్సులు బాదాడు. ఫలితంగా వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 162 పరుగులు సాధించింది.

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్​ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఆండ్రూ ఫ్లెచర్ (53) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా చిరాగ్ సూరి 42 పరుగులతో రాణించాడు.

రికార్డులు

  • టీ10 లీగ్​లో పూరన్​కు ఇది ఐదో అర్ధసెంచరీ. ఈ లీగ్​లో అత్యధిక హాఫ్ సెంచరీలు ఇతడివే.
  • ఈ మ్యాచ్​లో 12 సిక్సులు బాదాడు పూరన్. ఈ లీగ్​లో ఓ మ్యాచ్​లో ఇదే వ్యక్తిగత అత్యధికం.
  • ఈ మ్యాచ్​లో 89 పరుగులు సాధించాడు పూరన్. లీగ్​లో ఇది రెండో అత్యధిక స్కోర్. క్రిస్ లిన్ 2019 సీజన్​లో 91 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.