మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేన.. ప్రారంభంలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(1), కెప్టెన్ కోహ్లీ(9) వికెట్లు కోల్పోయింది. కుదురుకుంటున్న మరో ఓపెనర్ పృథ్వీషా(40).. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్, రాహుల్ జోడీ నిలకడగా ఆడారు. నాలుగో వికెట్కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ వెంటనే 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్.. నీషమ్ బౌలింగ్లో పెవిలియన్ బాట పట్టాడు.