సచిన్ తెందూల్కర్, వినోద్ కాంబ్లీ.. పాఠశాల స్థాయి నుంచి మంచి స్నేహితులు. టీమిండియాకూ కలిసి ఆడారు. అయితే ఇటీవల సచిన్.. కాంబ్లీకి సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఛాలెంజ్‌ను విసిరాడు. తన పాట 'క్రికెట్ వాలి బీట్'ను పాడి చూపించాలని జనవరి 21న సవాల్ చేశాడు. ఓ వారం గడువు కూడా ఇచ్చాడు. అయితే కాస్త సమయం తీసుకున్న కాంబ్లీ ఈనెల 3న ఈ సవాల్ పూర్తి చేశాడు. తాజాగా దీనికి మాస్టర్ కామెంట్ పెట్టాడు.
"చాలా బాగుంది కాంబ్లీ. టౌన్లోకి కొత్త ర్యాపర్ వచ్చినట్లు ఉంది" అంటూ సచిన్ కాంబ్లీ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.
-
That was really impressive, @vinodkambli349!
— Sachin Tendulkar (@sachin_rt) February 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Looks like there's a new rapper in town. 😎 https://t.co/kPT6kntHuC
">That was really impressive, @vinodkambli349!
— Sachin Tendulkar (@sachin_rt) February 12, 2020
Looks like there's a new rapper in town. 😎 https://t.co/kPT6kntHuCThat was really impressive, @vinodkambli349!
— Sachin Tendulkar (@sachin_rt) February 12, 2020
Looks like there's a new rapper in town. 😎 https://t.co/kPT6kntHuC
ఈ పాటను సోనూ నిగమ్‌తో కలిసి సచిన్ 2017లో పాడాడు. టీమిండియా తరఫున ప్రపంచకప్‌లో పాల్గొన్న క్రికెటర్ల పేర్లతో ఈ సాంగ్‌ను రూపొందించారు. వారికి ఈ పాటను అంకితం ఇచ్చారు.
సచిన్, కాంబ్లీ ఒకే పాఠశాలకు ఆడారు. ఒకే కోచ్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. అనంతరం టీమిండియాకు కలిసి ఆడారు. 1988లో పాఠశాల స్థాయిలో జరిగిన హరీస్ షీల్డ్ సెమీఫైనల్ ద్వారా వీరిద్దరూ వెలుగులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో శారదాశ్రమం విద్యామందిర్‌కు ఆడిన వీరిద్దరూ 664 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెయింట్ గ్జేవియర్ స్కూల్‌తో జరిగిన ఈ పోరులో సచిన్ 326*, కాంబ్లీ 349* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.