ప్రపంచకప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్ల్లో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ మండలి). సూపర్ ఓవర్ టై అయితే బౌండరీ కౌంట్కు బదులు ఫలితం తేలే వరకు సూపర్ ఓవరే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ వ్యంగ్యంగా స్పందించాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు ముట్టుకుని ఏం ప్రయోజనం అనే రీతిలో సమాధానమిచ్చాడు.
'టైటానిక్ ఓడపై నిలబడి మంచు పర్వతాలను గుర్తించడానికి మెరుగైన బైనాక్యులర్లను వినియోగించడమే తదుపరి అజెండా' అని ఐసీసీపై వ్యంగ్యాస్త్రాలను సంధించాడు జిమ్మీ. పరోక్షంగా చాలా ఆలస్యమైందనే అర్థంతో తనదైన శైలిలో ఉదహరించాడు.
-
Next on the agenda: Better binoculars for the Ice spotters on the Titanic https://t.co/nwUp4Ks3Mp
— Jimmy Neesham (@JimmyNeesh) October 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Next on the agenda: Better binoculars for the Ice spotters on the Titanic https://t.co/nwUp4Ks3Mp
— Jimmy Neesham (@JimmyNeesh) October 14, 2019Next on the agenda: Better binoculars for the Ice spotters on the Titanic https://t.co/nwUp4Ks3Mp
— Jimmy Neesham (@JimmyNeesh) October 14, 2019
ఐసీసీ నిర్ణయానికి కివీస్ మాజీ కోచ్ క్రేగ్ మెక్మిలన్ కూడా స్పందించాడు. 'ఐసీసీ కాస్త ఆలస్యమైంది' అని ట్వీట్ చేశాడు.
-
Bit late @ICC https://t.co/cT6PS1oMw3
— Craig McMillan (@cmacca10) October 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bit late @ICC https://t.co/cT6PS1oMw3
— Craig McMillan (@cmacca10) October 14, 2019Bit late @ICC https://t.co/cT6PS1oMw3
— Craig McMillan (@cmacca10) October 14, 2019
ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్-2019 ఫైనల్ మ్యాచ్ డ్రా అయింది. సూపర్ ఓవర్లలోనూ ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఈ తరుణంలో బౌండరీ లెక్కింపు విధానం ద్వారా ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లీష్ జట్టును విజేతగా నిర్ణయించారు. ఈ సూపర్ ఓవర్లో చివరి వరకు పోరాడినా.. జట్టును గెలిపించలేకపోయాడు నీషమ్.
ఇదీ చదవండి: బ్యాటింగ్, బౌలింగ్ వీడి.. నటన వైపు భారత క్రికెటర్లు!