ETV Bharat / sports

నేడే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీ ఫైనల్స్​ - Punjab

సయ్యద్ ముస్తాక్​ అలీ టీ20 టోర్నీ​ సెమీస్​ దశకు చేరింది. నేడు రెండు సెమీ ఫైనల్స్ మ్యాచ్​లు జరగనున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు తమిళనాడు-రాజస్థాన్​లు తలపడనుండగా.. రాత్రి 7గంటలకు పంజాబ్​-బరోడా మధ్య పోరు జరగనుంది.

Mushtaq Ali T20: TN holds edge over Rajasthan; Punjab favourites vs Baroda
నేడే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీ ఫైనల్స్​
author img

By

Published : Jan 29, 2021, 5:29 AM IST

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్​ నేడే జరగనుంది. తొలి సెమీస్​లో తమిళనాడుతో రాజస్థాన్, రెండో సెమీస్లో పంజాబ్​తో బరోడా తలపడనున్నాయి. వచ్చే నెలలోనే ఐపీఎల్​ వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో.. దేశీయ టోర్నీలో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడేందుకు సిద్ధమయ్యారు యువ క్రికెటర్లు.

మధ్యాహ్నం 12గంటలకు తమిళనాడు- రాజస్థాన్ మధ్య తొలి సెమీస్​​ జరగనుంది. క్వార్టర్​ ఫైనల్లో హిమాచల్​ ప్రదేశ్​పై చెలరేగిన షారుక్ ఖాన్, జగదీశన్.. తమిళనాడుకు ప్రధాన బలంగా మారారు. ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్​మన్ మహిపాల్​ సహ సీనియర్లు చాహర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్​లతో రాజస్థాన్​ బౌలింగ్​ పటిష్ఠంగా ఉంది. దీంతో రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

రెండో సెమీస్​​ మ్యాచ్​ పంజాబ్, బరోడా మధ్య రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. సిద్ధార్థ్ కౌల్, సందీప్​ శర్మ, అర్ష్​దీప్ సింగ్​, మయాంక్​ మార్కండేలతో పంజాబ్​ జట్టు బలంగా ఉంది. దీంతో క్వార్టర్స్​లో బరోడాకు హరియాణాతో మ్యాచ్​లో అద్భుత విజయాన్ని అందించిన విష్ణు సోలంకికి గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు కేదర్ దేవ్​దర్​ కూడా అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్​తో జట్టును చాలా సార్లు ఆదుకున్నాడు.

ఈ రెండు మ్యాచ్​లు అహ్మదాబాద్​లోని మొతెరా స్టేడియంలోనే జరగనున్నాయి. వీటిల్లో విజేతలు జనవరి 31న అదే మైదానంలో జరగనున్న ఫైనల్స్​లో పోటీపడతాయి.

ఇదీ చూడండి: సీనియర్లతో సచిన్ తనయుడు.. ఐపీఎల్ వేలానికి అర్హత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.