ETV Bharat / sports

ధోనీ ఎప్పటికీ నెం.1 ఆటగాడే:​ కైఫ్​

author img

By

Published : May 21, 2020, 5:25 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీకి ప్రత్యామ్నాయ ఆటగాడు లేడని అంటున్నాడు మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​. కేఎల్​ రాహుల్​తో అతడిని పోల్చలేమని తెలిపాడు. ఐపీఎల్​తో ధోనీ భవిష్యత్​ను ముడి పెట్టవద్దని సూచించాడు.

MS Dhoni is still No.1 wicketkeeper, should not be sidelined in a hurry: Mohammed Kaif
ధోని ఎప్పటికి నెం.1 ఆటగాడే: మహ్మద్​ కైఫ్​

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ ఫిట్​గా ఉన్నాడని తొందరపడి అతడిని జట్టు నుంచి పక్కన పెట్టొద్దని మాజీ క్రికెటర్​ మహ్మద్ ​కైఫ్​ కోరాడు. వికెట్​ కీపర్​గా ధోనీ గాయాలతో వైదొలిగినప్పుడు మాత్రమే కేఎల్​ రాహుల్​ను బ్యాకప్​ లాగా ఉపయోగించాలని సూచించాడు. 2019 ప్రపంచకప్​ తర్వాత మహీ ఏ అంతర్జాతీయ మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించలేదు. అందువల్ల అతడు రిటైర్మెంట్​ ప్రకటిస్తాడని వార్తలొచ్చాయి. అయితే మహేంద్రుడు ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.

"ఐపీఎల్​లో ప్రదర్శనను బట్టి ధోనీ భవిష్యత్​ ఆధారపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, నా దృష్టిలో ధోనీ ఉత్తమ ఆటగాడు. బ్యాటింగ్​లో 6, 7 స్థానాల్లో బరిలో దిగి.. ఒత్తిడిని జయిస్తూ అతడిలా ఆడటం కష్టం. అందుకే ధోనీ నా దృష్టిలో నెంబర్​వన్​ ఆటగాడు. ఎంతోమంది క్రికెటర్లు జట్టులోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అదేమి పెద్ద సమస్య కాదు. కానీ, ఎవర్ని అయినా జట్టులో నుంచి తీసివేసే ముందు అతని స్థానంలో సరిపోయే వ్యక్తిని ముందుగా ఎంపిక చేసుకోవాలి. కేఎల్​ రాహుల్​ వికెట్​ కీపర్​గా సరిపోతాడు. కానీ, ధోనీ అంతటి నేర్పరి కాదు. ధోనీకి గాయాలైనపుడు రాహుల్​ను కీపర్​గా ఉంచడం ఉత్తమం. ప్రపంచకప్​లో కివీస్​పై జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో జడేజాతో కలిసి మహీ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వారిద్దరి వల్ల ఆ మ్యాచ్​లో విజయం అంచుల వరకు వెళ్లాం".

-మహ్మద్​ కైఫ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

జట్టులోకి ధోనీని తిరిగి తీసుకోవడమనేది ఐపీఎల్​ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లీగ్​లో సత్తాచాటడానికి మార్చిలో చెన్నె సూపర్​కింగ్స్​ ఆటగాళ్ల శిక్షణా శిబిరంలో చేరాడు ధోనీ. కానీ, కరోనా లాక్​డౌన్​ కారణంగా మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్​ నిరవధికంగా వాయిదా పడింది.

ఇదీ చూడండి.. స్టేడియంలో శృంగార బొమ్మలు.. నిర్వాహకులకు జరిమాన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.