మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా జట్లకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ ట్వీట్‌కు బదులిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
"రేపు జరగనున్న మహిళా టీ20 ప్రపంచకప్ భారత్-ఆసీస్ మ్యాచ్ కంటే మరో పెద్ద విషయం ఏదీ లేదు. ఇరుజట్లు బాగా ఆడాలని కోరుకుంటున్నా. అత్యుత్తమ జట్టే గెలుస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు."
-మోదీ, భారత ప్రధానమంత్రి
అంతకుమందు ఆసీస్ ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
"నరేంద్ర మోదీ.. మెల్‌బోర్న్ వేదికగా రేపు మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆసీస్ జట్లు ఆడనున్నాయి. ఎంతో మంది ప్రేక్షకుల మధ్య రెండు ఉత్తమ జట్లు తలపడనున్నాయి. ఇది గొప్ప రోజుగా, మంచి మ్యాచ్‌గా నిలుస్తుంది. ఆసీస్ జట్టు తన మార్గంలో దూసుకెళ్తోంది."
-స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి
మెల్‌బోర్న్ వేదికగా రేపు జరగనున్న మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఆసీస్ నాలుగు సార్లు పొట్టి ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా నిలవగా, హర్మన్‌సేనకు ఇదే తొలి ఫైనల్.