ETV Bharat / sports

'ఆ విషయంలో బీసీసీఐ నిర్ణయం సరైనదే'

author img

By

Published : Aug 7, 2020, 11:01 AM IST

ఈ ఏడాది మహిళల ఛాలెంజ్‌ సిరీస్‌, మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ ఒకే సమయంలో నిర్వహించనున్నారు. దీనిపై విదేశీ క్రికెటర్లు కొందరు అసహనం వ్యక్తం చేయగా.. ఆ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది టీమ్​ఇండియా వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌. కరోనా వేళ నాలుగు మ్యాచ్‌ల ఛాలెంజ్​ సిరీస్‌ ఖరారులో బీసీసీఐ ఉత్తమ నిర్ణయమే తీసుకొన్నదని వివరించింది.

Mithali Raj opens-up about overlap of Women's T20 Challenge with WBBL
'ఆ విషయంలో బీసీసీఐ నిర్ణయం సరైనదే'

మహిళల బిగ్​బాష్​ లీగ్​(డబ్ల్యూబీబీఎల్​) సమయంలో మహిళల టీ20 ఛాలెంజ్​ నిర్వహించడం పట్ల విదేశీ క్రీడాకారిణుల నిరాశ అర్థం చేసుకోదగిందేదనని తెలిపింది టీమ్​ ఇండియా కెప్టెన్​ మిథాలీ రాజ్​. అయితే ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం నూటికి నూరుశాతం సరైనదని చెప్పింది. బోర్డు అత్యుత్తమ కృషి ఫలితంగానే టీ20 ఛాలెంజ్​ జరగుతుందని పేర్కొంది.

యూఏఈలో ఐపీఎల్​ మధ్యలో నవంబర్​ 1 నుంచి 10 వరకు టీ20 ఛాలెంజ్​ జరిగే అవకాశముంది. అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 29 వరకు డబ్ల్యూబీబీఎల్​ నిర్వహిస్తున్నారు. దీనిపై అలీసా హేలీ, సుజీ బేట్స్​, రాచెల్​ హేన్స్​ వంటి క్రీడాకారిణులు అసంతృప్తి వ్యక్తంజేశారు.

"కొందరు త్వరగా ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేష్​ పటేల్​ మహిళల క్రికెట్​ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో టీ20 ఛాలెంజ్​ నిర్వహిస్తారని ఊహించలేదు. అసలు ఐపీఎల్​ జరుగుతుందనే అనుకోలేదు. అలాంటిది మహిళల మ్యాచ్​లు నిర్వహించడాన్ని స్వాగతించాల్సిందే. కొందరు విదేశీ క్రీడాకారిణులు మ్యాచ్​ల తేదీలను ప్రశ్నిస్తున్నారు. వారి నిరాశ అర్థం చేసుకోదగిందే. వాళ్లు కూడా ఆడాలని కోరుకుంటున్నారు. అత్యుత్తమ క్రీడాకారిణులు ఆడాలన్నదే నా అభిప్రాయం కూడా. కాని ఇవి అసాధారణ పరిస్థితులు. సాధారణంగా ఏప్రిల్​-మే నెలల్లో ఐపీఎల్​ జరిగేది. డబ్ల్యూబీబీఎల్​ సమయంలో ఈ టోర్నీ ఉండేది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు నిర్ణయం సరైనదే"

-- మిథాలీ రాజ్​, భారత మహిళా క్రికెటర్​

భారత్​లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్​ యూఏఈ వేదికగా జరగనుంది. సెప్టెంబర్​ 19న మొదలై నవంబర్​ 10న టోర్నీ ముగియనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.