పాదచారుడైన ఓ వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన కారణంగా శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబోలోని పనాదురా శివార్లలో ఓ 74 ఏళ్ల వ్యక్తిని కారుతో ఢీకొట్టిగా.. ఆ వృద్ధుడు మరణించాడు. మెండిస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.
శ్రీలంక జాతీయ జట్టుకు వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్న మెండిస్ ఇప్పటివరకు 44 టెస్టులు, 76 వన్డేలు ఆడాడు. కరోనా లాక్డౌన్ తర్వాత జరగుతున్న క్రికెటర్ల శిక్షణా శిబిరంలో మెండిస్ పాల్గొన్నాడు. భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇరు దేశాల బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి.