ETV Bharat / sports

ఆ దేశంలోని రోడ్లకు సచిన్​, కోహ్లీల పేర్లు - వీధులకు క్రిెకెటర్ల పేర్లు

ఎవరిపైనా అయినా అభిమానం ఉంటే వారి పేర్లను తమ కుటంబ సభ్యుల్లోని వ్యక్తులకు లేదంటే సంతానానికి పెడతారు. కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి మాత్రం ప్రముఖ​ క్రికెటర్లు సచిన్​, కోహ్లీ సహా ఎంతోమంది పేర్లను, ఓ ఎస్టేట్​లోని రోడ్లకు నామకరణం చేశారు.

kohli, sachin
కోహ్లీ, సచిన్​
author img

By

Published : Jun 14, 2020, 8:42 AM IST

మీకు భారత్​ క్రికెటర్లలో ఎవరంటే చాలా ఇష్టం? సచిన్, కోహ్లీ లేదంటే ధోనీ.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతారు. వారిపై తమకున్న అభిమానాన్ని టీషర్ట్​లపైనో, ఇంట్లో గోడలపై పోస్టర్​లు అతికించి చూపిస్తారు. రకరకాల పద్ధతుల్లో ఆ ఆటగాళ్లను ఆరాధిస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం.. తన గృహ సముదాయంలోని రోడ్లకు ప్రపంచంలోని దిగ్గజ క్రికెటర్ల పేర్లు పెట్టేశారు. అయితే వారి గౌరవార్ధమే ఇలా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఆస్ట్రేలియాలో మెల్​బోర్న్​లోని మెల్టాన్​ ప్రాంతంలో శర్మ అనే గృహవ్యాపారి.. కొత్తగా కడుతున్న ఓ హౌస్ ఎస్టేట్​లోని రోడ్లకు సచిన్​, కోహ్లీ సహా ఇతర క్రికెటర్ల పేర్లను నామకరణం చేశాడు. ఇందులో తెందుల్కర్​ డ్రైవ్ , కోహ్లీ క్రిసెంట్​, అక్రమ్​ వే(వసీం అక్రమ్), హ్యాడ్లీ స్ట్రీట్​(రిచార్డ్​ హ్యాడ్లీ), దేవ్​ టెర్రస్(కపిల్​ దేవ్​),​ కలీస్​ వే(జాక్వెస్​ కలీస్), వెస్టిండీస్​(సర్​ గ్యారీఫీల్డ్ సోబర్స్), వా​ స్ట్రీట్(స్టీవ్​ వా​) అనే రోడ్లు ఉన్నాయి. దీనికి అక్కడి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.

kohli sachin
కోహ్లీ, సచిన్​ పేర్లతో వీధులు

ఇలా పేర్లు పెట్టడం ద్వారా చుట్టుపక్కల నివసించే వారు, క్రికెట్ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని శర్మ అంటున్నాడు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు తమ ఎస్టేట్​ గురించి వాకబు చేస్తున్నారని అన్నారు. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్​ఇండియా రానున్న సందర్భంగా కోహ్లీ.. ఈ రోడ్లపై ప్రయాణించాలని శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

cricketer names
వీధులకు స్టార్​ క్రికెటర్ల పేర్లు

ఇది చూడండి : 'ఐపీఎల్​కు ఆ ప్రదేశమైతే అనుకూలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.