ETV Bharat / sports

'ప్రపంచకప్​ కోసం మూడు వారాల ప్రాక్టీసు చాలు'

ప్రస్తుత పరిస్థితి చక్కదిద్దుకుంటే, టీ20 ప్రపంచకప్​నకు సిద్ధమయ్యేందుకు తమకు మూడు వారాలు చాలని అన్నాడు ఇంగ్లీష్ క్రికెటర్ జేసన్ రాయ్.

'ప్రపంచకప్​ కోసం మూడు వారాల ప్రాక్టీసు చాలు'
ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్
author img

By

Published : May 4, 2020, 1:28 PM IST

టీ20 ప్రపంచకప్​ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జేసర్ రాయ్. సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేకపోతేనే టోర్నీని వాయిదా వేయాలని, ఒకవేళ పరిస్థితి కుదుటపడితే, మైదానంలోకి దిగేందుకు ఆటగాళ్లకు మూడు వారాలు చాలని అభిప్రాయపడ్డాడు. ఓ క్రికెట్ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాల్ని చెప్పాడు.

"ఆటగాళ్లకు సరైన సన్నద్ధత లేకపోయినా, ఆస్ట్రేలియాకు వెళ్లలేని పరిస్థితి వచ్చినా.. ప్రపంచకప్​ను వాయిదా వేస్తే బాగుంటుంది. ఒకవేళ అంతా సద్దుమణిగితే, ప్రాక్టీసు అయ్యేందుకు మాకు మూడు వారాలు చాలు. టీ20 ప్రపంచకప్​ ఆడేందుకు మేం సిద్ధమైపోతాం. అయితే స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఆడించాలని బోర్డులు భావిస్తే అది మంచి నిర్ణయమే" -జేసర్ రాయ్, ఇంగ్లాండ్ క్రికెటర్

cricketer Jason Roy
జేసర్ రాయ్, ఇంగ్లాండ్ క్రికెటర్

కరోనా ప్రభావం తీవ్రమవుతుండటం వల్ల ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్​ 18-నవంబర్​ 15 మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్​పై సందిగ్ధత నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.