ETV Bharat / sports

బాబర్ అజామ్​పై లైంగిక వేధింపుల కేసు నమోదు - బాబర్ అజామ్​పై లైంగిక దోపిడీ కేసు

పాకిస్థాన్ కెప్టెన్​ బాబర్​ అజామ్​పై ఇటీవలే ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన తగిన సాక్ష్యాలతో బాధితురాలు కోర్టును ఆశ్రయించగా.. సదరు క్రికెటర్​పై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

Lahore court orders police to register FIR against Babar Azam on sexual exploitation complaint
బాబర్​ అజామ్​పై లైంగిక దోపిడీ కేసు
author img

By

Published : Jan 15, 2021, 8:29 AM IST

Updated : Jan 15, 2021, 11:22 AM IST

పాకిస్థాన్​ క్రికెట్ కెప్టెన్ బాబర్​ అజామ్​పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాబర్​ తనను లైంగికంగా వేధించాడని గతంలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించక పోవడం వల్ల ఇటీవలే లాహోర్​లోని అదనపు సెషన్స్​ కోర్టును ఆశ్రయించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం సదరు క్రికెటర్​పై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

లాహోర్​కు చెందిన హమీజా ముక్తార్ అనే మహిళ.. బాబర్​ ఆజామ్​పై ఈ ఆరోపణలు చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్.. తనను లైంగికంగా వాడుకున్నాడని ఇటీవలే మీడియాతో వెల్లడించింది. బలవంతంగా అబార్షన్​ కూడా చేయించాడని తెలిపింది. దానికి సంబంధించిన కొన్ని వైద్య పత్రాలను కోర్టుకు సమర్పించింది. వాటిని పరిశీలించిన న్యాయస్థానం బాబర్​పై వెంటనే కేసు నమోదు చేయాలని నసీరాబాద్​ స్టేషన్​ ఎస్​హెచ్​వోను ఆదేశించింది.

ఇదీ చూడండి: పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ అజమ్​పై రేప్ కేసు!

Last Updated : Jan 15, 2021, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.