ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. 13వ ఎడిషన్‌లో భాగంగా క్రికెటర్లను ఎంపిక చేసుకొనేందుకు... డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఆటగాళ్లను తీసుకోవడానికి, విడిచిపెట్టడానికి ఏర్పాటు చేసిన లీగ్ ట్రేడింగ్ విండో గడువు నవంబర్ 14తో ముగియనుంది.
ఐపీఎల్ 2019 సీజన్ కోసం రూ.82 కోట్లు కేటాయించిన ఆయా ఫ్రాంఛైజీలు.. 2020 సీజన్ కోసం రూ.85 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది.
ఫ్రాంఛైజీల వద్ద మిగిలి ఉన్న నగదు
- చెన్నై సూపర్ కింగ్స్-రూ 3.2 కోట్లు
- దిల్లీ క్యాపిటల్స్-రూ 7.7 కోట్లు
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రూ 3.7 కోట్లు
- కోల్‌కతా నైట్ రైడర్స్-రూ 6.05 కోట్లు
- ముంబయి ఇండియన్స్-రూ 3.55 కోట్లు
- రాజస్థాన్ రాయల్స్-రూ 7.15 కోట్లు
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రూ.1.80 కోట్లు
- సన్‌రైజర్స్ హైదరాబాద్-రూ 5.30 కోట్లు
ఇవీ చూడండి.. 'బిగ్‌బాష్' బరిలో డివిలియర్స్ ఎంట్రీ