దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. డీడీసీఏ చీఫ్ కోచ్‌గా ఆయన నియమితులయ్యారు. సీనియర్ విభాగంలో 2020-21 సీజన్‌కు శిక్షకుడిగా రాజ్ కుమార్ వ్యవహరించనున్నారు. డీడీసీఏకు అసిస్టెంట్ కోచ్‌గా గురుశరణ్ సింగ్ ఎంపికయ్యారు. ఈ మేరకు డీడీసీఏ ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
కోహ్లీకి బాల్యంలో క్రికెట్ నేర్పిన కోచ్‌గా రాజ్‌కుమార్ సుపరిచితం. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన రాజ్‌కుమార్.. దిల్లీ తరఫున తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ వంటి అద్భుత ఆటగాడిని తీర్చిదిద్దినందుకు గానూ 2016లో ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు.
డీడీసీఏలో కొత్తగా..
డీడీసీఏ సెలెక్షన్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా అశు డానీ నియమితులయ్యారు. మోహన్ చతుర్వేదీ, చైతన్యా నందా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. డీడీసీఏ ట్రైనర్‌గా ఉమేశ్ చికారా, కొత్త ఫిజియోగా గజేంద్ర కుమార్ ఎంపికయ్యారు. క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) పర్యవేక్షణలో ఈ నూతన సభ్యుల నియామకం చేపట్టినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఆదివారం తెలిపారు.
ఇదీ చూడండి:'టీమ్ఇండియా ఈ మార్పులు చేయాలి'