ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ 1, సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచారు. బౌలర్ల జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో ఉండగా.. ఆల్రౌండర్లలో రవీంద్ర జడేజా, హర్దిక్ పాండ్య టాప్-20లో ఉన్నారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ 837 మూడో స్థానానికి పరిమితమయ్యాడు. రాస్ టేలర్(818), ఆరోన్ ఫించ్(791) టాప్-5లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(722) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో అఫ్గాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్(701), మూడో స్థానంలో భారత పేసర్ బుమ్రా(700) కొనసాగుతున్నారు.
వెస్ట్విండీస్తో సిరీస్‌లో విజయవంతమైన బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిదీ హసన్ తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ నాలుగో స్థానంలో నిలిచాడు. 19వ స్థానంలో ఉన్న బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ 8వ స్థానం పొందాడు.
మహిళల ర్యాంకింగ్స్..
మహిళలకు సంబంధించి పరిమిత, పొట్టి ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌ను ఐసీసీ ప్రకటించింది. టీమ్ ర్యాకింగ్స్లో ఇరు ఫార్మాట్లలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. వన్డేల్లో రెండో స్థానంలో ఉన్న భారత్.. టీ-20ల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో ఆసీస్ బ్యాట్స్ఉమెన్ మెగ్ లానింగ్ అగ్ర స్థానంలో నిలిచింది. భారత్ తరఫున స్మృతి మంథాన నాల్గో స్థానంలో ఉంది. టీ-20ల్లో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ తొలి స్థానంలో ఉండగా.. ఇండియా నుంచి షఫాలీ వర్మ మూడో స్థానంలో కొనసాగుతోంది.
వన్డే బౌలింగ్ విభాగంలో జులాన్ గోస్వామి మాత్రమే టాప్-5లో నిలిచింది. రెండు ఫార్మాట్లలోనూ ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ నాల్గో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: బయో బబుల్‌లో ఉండటంపై ఆసీస్ కెప్టెన్ ఆందోళన