5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఈ ఓటమితో జట్టు సభ్యులు ఎవరూ కృంగిపోలేదని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. ప్రపంచకప్‌లో దీన్ని పునరావృతం కానివ్వబోమని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెగాటోర్నీకి వెళ్లేందుకు జట్టు సమతూకంగా ఉందన్నాడు.
నిజం చెప్పాలంటే మా ఆటతో ఎవరూ అసంతృప్తి చెందలేదు. కొన్ని కొన్ని ప్రయోగాలు చేశాం. కానీ అవి ఓటమిని తప్పించలేకపోయాయి. ప్రపంచకప్‌లో ఆడే 11 మందిపై టీం మేనేజ్మెంట్కు పూర్తి స్పష్టత ఉంది.
--- విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్
దిల్లీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 273 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. దాన్ని ఛేదించే క్రమంలో 237 పరుగులకే ఆలౌటైంది టీమిండియా. మ్యాచ్ ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది.
వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టుపై పూర్తి స్పష్టత ఉంది. ఇప్పుడు మా దృష్టంతా సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే ఉంది. మేం వారి దేశంలో ఎలా ఆడామో ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు అలా ఆడింది. ప్రపంచకప్ ముందు ఈ విజయం వారికి ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు - విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్