ETV Bharat / sports

నీషమ్​కు రాహుల్​ రిప్లై... ఏప్రిల్​లో కలుద్దాం!

టీమిండియా​ బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​, న్యూజిలాండ్​ ఆల్​రౌండర్​ జిమ్మీ నీషమ్​ మధ్య ట్విట్టర్​ సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. కివీస్​తో జరిగిన ఆఖరి వన్డేలో శతకంతో రాణించాడు రాహుల్​. అయితే మ్యాచ్​లో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా.. ఇద్దరి మధ్య చిన్న సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అనంతరం ట్విట్టర్​ వేదికగా నీషమ్​.. రాహుల్​పై ఓ ట్వీట్​ ​చేయగా ​దానికి తాజాగా తనదైన రీతిలో రిప్లై ఇచ్చాడీ భారత క్రికెటర్​​.

author img

By

Published : Feb 12, 2020, 2:54 PM IST

Updated : Mar 1, 2020, 2:21 AM IST

KL Rahul to settle 'rock, paper, scissors' score with James Neesham in IPL 2020
నీషమ్ ట్వీట్​కు రాహుల్​ రిప్లై.. ఏప్రిల్​లో తేల్చుకుందాం!

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. సరదా ట్వీట్లతో సందడి చేస్తుంటాడు. తాజాగా టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్‌ అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో రాహుల్ (112) శతకంతో మెరిశాడు. అయితే 20వ ఓవర్‌లో రాహుల్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించగా నీషమ్‌ అతడికి ఎదురుగా వచ్చాడు. ఫలితంగా రాహుల్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినా తర్వాత వెంటనే ఇద్దరూ నవ్వుకొన్నారు.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం నీషమ్‌ దీనిపై ట్వీట్‌ చేశాడు. "రాహుల్‌ కాస్త పరుగులు దాచుకో. ఏప్రిల్‌లో మరిచిపోకుండా సాధించు" అని ట్వీట్​ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మ్యాచ్‌ మధ్యలో వారు ఎదురుపడిన ఫొటోని జత చేస్తూ మరో ట్వీట్‌ చేశాడు. ‘‘పేపర్‌, సిజర్స్‌, రాక్‌’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టాడు. దీనికి రాహుల్ స్పందించాడు. "ఏప్రిల్‌లో దీనిని పరిష్కరించుకుందాం. త్వరలోనే కలుద్దాం" అని అన్నాడు.

  • Let’s settle this in April. See u in a bit 🤙🏾

    — K L Rahul (@klrahul11) February 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇద్దరూ ఒకే జట్టులో...

ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు రాహుల్ సారథిగా ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో నీషమ్‌ను పంజాబ్‌ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో కూడా రాహుల్‌ రాణించాలనే ఉద్దేశంతో నీషమ్ అలా ట్వీట్‌ చేశాడు. అయితే ఓ నెటిజన్‌ మ్యాచ్‌లో ఎవరు ఎవరిని కవ్వించారు..? అని నీషమ్​ను ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన కివీస్​ ప్లేయర్​.. అలాంటిది ఏమీ లేదని, అది సరదాగా మాత్రమే అని బదులిచ్చాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 0-3 తేడాతో కోల్పోయింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 21న తొలి టెస్టు మొదలుకానుంది.

Last Updated : Mar 1, 2020, 2:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.