వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రూ రసెల్‌పై ప్రశంసలు కురిపించాడు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఇతడిని కేకేఆర్ జట్టు మొదట్లోనే కొనుగోలు చేసి ఉంటే ఐపీఎల్‌లో మరిన్ని టైటిల్స్ గెలిచే వాళ్లమని అభిప్రాయపడ్డాడు గౌతీ.
"కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ రూ. 50 లక్షలకు రసెల్‌ను కొనుగోలు చేయగా, దిల్లీ ఫ్రాంఛైజీ రూ. 8 కోట్లకు పవన్ నేగిని సొంతం చేసుకుందంటే ఒక్కసారి ఊహించుకోండి. నేను కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో కాస్త ముందుగా రసెల్‌ను తీసుకోవాల్సింది. అలా అయితే కనీసం ఒకటి లేదా రెండు టైటిల్స్ ఎక్కువ గెల్చుకునేవాళ్లం"
-గంభీర్, టీమిండియా మాజీ క్రికెటర్
2012లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రసెల్.. తొలుత దిల్లీ క్యాపిటల్స్ (దిల్లీ డేర్‌డెవిల్స్) తరఫున ఆడాడు. గాయాల వల్ల ఆ సీజన్లో తక్కువ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అనంతరం 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇతడిని కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు తన విధ్వంసకర ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లాడిన రసెల్.. 1400 పరుగులు చేయడం సహా, 55 వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి : 'పాక్ క్రికెటర్లూ ఆ విషయంలో మీరు బాధ్యతగా ఉండాలి'