వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కెప్టెన్‌గా కొనసాగుతున్న జాసన్ హోల్డర్‌ను తొలగించి ఆ స్థానంలో పొలార్డ్‌ను ఎంపికచేసింది. ఇప్పటినుంచి వన్డేలు, టీ20లకు అతడు సారథిగా కొనసాగుతాడని విండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రికీ స్కెరిట్ అధికారికంగా ప్రకటించారు.
వెస్టిండీస్ క్రికెట్ కమిటీ వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా విధ్వంసకర ఆల్‌రౌండర్ పొలార్డ్‌కు బాధ్యతలు అప్పగించింది. 2016లో చివరగా వన్డేలు ఆడిన ఈ ఆటగాడు.. ఈ నిర్ణయంతో ప్రస్తుతం జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.
ఇప్పటివరకు విండీస్ తరఫున 101 వన్డేలు ఆడిన ఈ 32 ఏళ్ల ఆటగాడు 2,289 పరుగులు చేశాడు. 62 అంతర్జాతీయ టీ 20లలో 903 పరుగులు సాధించాడు.
'ఈ నిర్ణయం హోల్డర్‌తో ప్రస్తావించి తీసుకున్నామని.. ఇకపై అతను టెస్టులుకు మాత్రమే సారథిగా కొనసాగుతాడని' తెలిపాడు అధ్యక్షుడు స్కెరిట్.
"ఇప్పటినుంచి హోల్డర్ టెస్టు కెప్టెన్‌గా మాత్రమే కొనసాగుతాడు. ఈ జట్టులో స్థానం కోసం పోటీపడుతూ మంచి ఆటగాడిగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు పొలార్డ్. ఎంతో ఉత్సాహంగా ఉంటూ.. ఆటపై నిబద్ధత చూపించే అతడు ఈ సమయంలో టీ20 బాధ్యతలకు సరైనవాడు." -రికీ స్కెరిట్, విండీస్ అధ్యక్షుడు
పది జట్లు పాల్గొన్న ప్రపంచకప్‌లో హోల్డర్ సారథ్యంలో బరిలోకి దిగిన విండీస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియాతో జరిగిన వన్డే, టీ20లకు బ్రాత్‌వైట్ సారథ్యం వహించాడు. ఈసిరీస్లోనూ దారుణమైన ప్రదర్శనతో ఓటమి చవిచూసింది కరీబియన్ జట్టు.
ఇదీ చూడండి: గృహహింస కేసులో షమి అరెస్టుపై స్టే