ప్రపంచకప్‌లో ఆడతాడా లేదా అని అనుమానంగా ఉన్న కేదార్ జాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. త్వరలో జరిగే ప్రపంచకప్ కోసం మే 22న టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు.
ఇటీవలే జరిగిన ఐపీఎల్లో చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు కేదార్ జాదవ్. పంజాబ్‌తో మ్యాచ్‌లో బంతిని అందుకునే క్రమంలో అతడి భుజానికి గాయమైంది. జాదవ్‌కు సంబంధించిన ప్రస్తుత హెల్త్ సర్టిఫికెట్‌ను బీసీసీఐకు సమర్పించాడు ఫిజియో పాట్రిక్ ఫరార్త్.
54 వన్డేలు ఆడిన జాదవ్ 43.50 సగటుతో 1174 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలర్‌గా 27 వికెట్లు తీశాడు.
మే 30న ప్రారంభం కానుంది ప్రపంచకప్. జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. అంతకు ముందు మే 25న న్యూజిలాండ్‌తో, 28న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది.
ఇది చదవండి: అంత బాధలోనూ సెంచరీ కొట్టిన జేసన్