2020-21కి గానూ క్రికెట్ అవార్డులను ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం.. సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్‌ను కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దక్కించుకున్నాడు. గత ఆరేళ్లలో కేన్ ఈ బహుమతిని దక్కించుకోవడం నాలుగో సారి. దీంతో పాటు అంతర్జాతీయ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా కేన్ నిలిచాడు.
స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 639 పరుగులు సాధించాడు విలియమ్సన్. నాలుగో సారి అవార్డును గెలుపొందిన విలియమ్సన్కు హ్యాడ్లీ స్వయంగా ఫోన్ చేసి అభినందించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది.
ఇదీ చదవండి: 205 మ్యాచ్‌ల్లో 2 సార్లు మాత్రమే ముంబయిపై అలా..
అవార్డుల వివరాలు..
సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ - కేన్ విలియమ్సన్.
బెర్ట్ సట్‌క్లిఫ్ మెడల్ ఫర్ ఔట్‌స్టాండింగ్ సర్వీసెస్ టూ క్రికెట్ - జెఫ్ క్రో.
ఇంటర్నేషనల్ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - కేన్ విలియమ్సన్.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - అమీ సాటర్త్వైట్.
ఇంటర్నేషనల్ మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - డెవాన్ కాన్వే.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - అమేలియా కెర్.
ఇంటర్నేషనల్ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ - డెవాన్ కాన్వే.
ఇదీ చదవండి: రాజస్థాన్‌కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి స్టోక్స్ ఔట్