ETV Bharat / sports

ఒలింపిక్స్ ఈసారి వాయిదా పడితే రద్దు తప్పదా? - IOC President Thomas Bach

వచ్చే ఏడాది ఒలింపిక్స్​ను కచ్చితంగా జరుపుతామని, లేదంటే పూర్తిగా రద్దవుతుందని చెప్పారు అంతర్జాతీయ ఒలింపిక్​ సమన్వయ కమిటీ ఛైర్మన్​.

It's 2021 or never for Tokyo Olympics, says senior IOC official
'వచ్చే ఏడాది నిర్వహించకపోతే పూర్తిగా రద్దు అవుతుంది'
author img

By

Published : Jun 7, 2020, 6:41 PM IST

వచ్చే ఏడాది అనుకున్న సమయానికే ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు​ అంతర్జాతీయ ఒలింపిక్​ సమన్వయ కమిటీ అధ్యక్షుడు పియరీ-ఆలివర్​ బెకర్స్​-వియుజెంట్. ఒకవేళ అలా కుదరని పరిస్థితిల్లో పూర్తిగా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడ్డి ఈ క్రీడల్ని మరోసారి అలా చేయడం కుదరదని అభిప్రాయపడ్డారు.

Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్

"వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్​ ప్రారంభమవుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కచ్చితంగా మెగాక్రీడలు అప్పుడే జరిగి తీరుతాయి. లేని పక్షంలో పూర్తిగా రద్దవుతాయి. ఇలా వాయిదా వేసుకుంటా వెళ్తే అయ్యే ఖర్చును ఊహించలేం. ఇందులో పాల్గొనే వేలాది మంది దృష్టిలో పెట్టుకునే దీనిపై నిర్ణయాన్ని తీసుకుంటాం"

- పియరీ-ఆలివర్​ బెకర్స్​-వియుజెంట్​, ఐఓసీ సమన్వయ కమిటీ ఛైర్మన్​

ఇదే విషయమై మాట్లాడిన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్​ బాచ్.. వచ్చే ఏడాది అనుకున్న సమయానికి ఒలింపిక్స్​ జరగకపోతే, ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించలేదని తెలిపారు. ఒలింపిక్స్​ను నిర్వహించే ముందు సాధారణ క్రీడాటోర్నీలు జరపడం ఆనవాయితీ అని ఆయన చెప్పారు.

షెడ్యూల్​ ప్రకారం ఈ ఏడాది జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్​ను, కరోనా వైరస్ వల్ల వచ్చే సంవత్సరం జులై 23 నుంచి ఆగస్టు 8 తేదీల మధ్య జరపాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి... 'అలా అయితే స్టోక్స్ ఆటపై తీవ్ర ప్రభావం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.