ETV Bharat / sports

టీమ్​ఇండియాకు గాయాల గోల.. అసలెందుకిలా?

author img

By

Published : Jan 24, 2021, 7:57 AM IST

ఆస్ట్రేలియా​ సిరీస్​లో భారత ఆటగాళ్లు ఎంత మంది గాయపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువ ఆటగాళ్ల అద్భుత పోరాట పటిమతో.. జట్టులో ఉన్న ఇద్దరో ముగ్గురో సీనియర్‌ ఆటగాళ్ల అనుభవంతో సిరీస్​ గెలవడం వల్ల ఈ గాయాల గురించి మాట్లాడటం మానేశాం కానీ.. అదే ఓడిపోయి ఉంటే జట్టు మేనేజ్‌మెంట్‌పై ఎన్నో విమర్శలు వచ్చేవి. ఆటగాళ్లు గాయాల బారిన పడుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు కురిపించేవాళ్లు. కాబట్టి జట్టు గెలిచినప్పటికీ ఆటగాళ్ల గాయాల సమస్యను మాత్రం టీమ్​మేనేజ్​మెంట్​ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

team india
టీమ్​ఇండియా

కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌, విహారి, పంత్‌, జడేజా, అశ్విన్‌, ఉమేశ్‌, షమి, సైని, బుమ్రా... వీళ్లంతా ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై సిరీస్‌ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు కదా అనుకుంటున్నారా? అయితే మీరు పిచ్‌ మీద కాలు వేసినట్లే! ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడ్డ ఆటగాళ్ల జాబితా ఇది. ఆటలో గాయాలు సహజమే కానీ.. ఒక్క సిరీస్‌లోనే ఇంత మంది గాయాల పాలవడం ఎప్పుడైనా చూశారా? సిరీస్‌ గెలిచారు కాబట్టి సరిపోయింది కానీ.. ఒకవేళ ఫలితం తేడాగా వస్తే పరిస్థితి ఎలా ఉండేది? అసలు ఒకే సిరీస్‌లో ఇంతమందికి గాయాలవుతుంటే జట్టు మేనేజ్‌మెంట్‌ ఏం చేస్తోంది? ఇక ఫిజియోలు ఎందుకున్నట్టు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

యువ ఆటగాళ్ల అద్భుత పోరాట పటిమతో.. జట్టులో ఉన్న ఇద్దరో ముగ్గురో సీనియర్‌ ఆటగాళ్ల అనుభవంతో గబ్బా టెస్టులో గెలిచిన టీమ్‌ఇండియా 2-1తో సిరీస్‌ సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని అందరూ కొనియాడారు. అత్యుత్తమ తుది జట్టు లేకుండానే.. పదకొండు మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే.. గొప్ప ప్రదర్శన చేసిన జట్టు విజయం గురించి ఎప్పటికీ ఘనంగా చెప్పుకోవచ్చు. టీమ్‌ఇండియా సిరీస్‌ గెలిచింది కాబట్టి అందరూ సంబరాల్లో మునిగిపోయారు. కానీ గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైన జట్టు.. ఒకవేళ ఓడిపోయి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? జట్టు మేనేజ్‌మెంట్‌పై ఎన్నో విమర్శలు వచ్చేవి. ఆటగాళ్లు గాయాల బారిన పడుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు కురిపించేవాళ్లు. ఇప్పుడు జట్టు గెలిచినప్పటికీ ఆటగాళ్ల గాయాల సమస్యను మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.

వాళ్లు లేకుంటే..: ఆస్ట్రేలియాతో తొలి మూడు టెస్టులు ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సిరీస్‌లో సమంగా నిలిచాయి. అప్పటికే గాయాలతో రాహుల్‌, విహారి, జడేజా, అశ్విన్‌, ఉమేశ్‌, షమి, బుమ్రా జట్టుకు దూరమయ్యారు. బ్యాటింగ్‌లో ఇబ్బంది లేదు.. కానీ బౌలింగ్‌లో మాత్రం ప్రధాన ఆటగాళ్లే లేరు. అప్పుడే జట్టులోకి నటరాజన్‌, సుందర్‌, శార్దూల్‌ వచ్చారు. వాళ్లు నెట్‌ బౌలర్లుగా ఆస్ట్రేలియాలో ఉన్నారు కాబట్టి జట్టులోకి తీసుకోగలిగారు. ఒకవేళ వాళ్లు లేకుంటే జట్టు పరిస్థితి ఎలా ఉండేది? ఓ మ్యాచ్‌ ఆడేందుకు పదకొండు మంది కోసం వెతుక్కునే దుర్భర పరిస్థితి జట్టుకు ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. ఆటగాళ్ల గాయాల విషయంలో జట్టు యాజమాన్యం సరైన విధానం అనుసరించడం లేదని క్రికెట్‌ పండితులు విమర్శిస్తున్నారు. అందుకు ఐపీఎల్‌-13 సందర్భంగా గాయపడ్డ రోహిత్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ లీగ్‌ సందర్భంగా గాయపడ్డ అతను.. పూర్తిగా కోలుకోకముందే ఫైనల్‌ ఆడేశాడు. దీంతో గాయం పెద్దదై ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకూ దూరమయ్యాడు. రోహిత్‌ యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లకుండా స్వదేశానికి రావడం వల్ల క్వారంటైన్‌ ఆలస్యమై తొలి రెండు టెస్టులకు దూరం కావడం.. అతడి ఫిట్‌నెస్‌పై, ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్నదానిపై తనకు సమాచారం లేదని కోహ్లి చెప్పడం.. ఇవన్నీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, గాయాలపై జట్టు యాజమాన్యం పర్యవేక్షణ కొరవడిందనడానికి నిదర్శనం.

లాక్‌డౌన్‌ వచ్చిందనా..

కరోనా-లాక్‌డౌన్‌ వల్ల ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రభావం పడిందనేది నిజమే కావొచ్చు. కానీ ఆ విరామ సమయాల్లో జట్టు మేనేజ్‌మెంట్‌ కానీ ఫిజియోలు కానీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ గురించి పట్టించుకున్నారా? వాళ్లు ఇళ్లలో కసరత్తులు చేస్తున్నారా అని పర్యవేక్షించారా? లాక్‌డౌన్‌ తర్వాత ఐపీఎల్‌-13 ఆడిన టీమ్‌ఇండియా క్రికెటర్లు.. ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఇలా దాదాపు అన్ని జట్లు తిరిగి మ్యాచ్‌లాడాయి. కానీ ఏ జట్టుకూ టీమ్‌ఇండియా పరిస్థితి ఎదురు కాలేదు. ఏ జట్టులోనూ ఇంతమంది ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్‌లకు దూరం కాలేదు. విరామం తర్వాత ఐపీఎల్‌, ఆ వెంటనే ఆస్ట్రేలియాతో సిరీస్‌ అంటే భారత క్రికెటర్లపై పని భారం పెరిగిందని అంటున్నారు. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌, ఆ తర్వాత భారత్‌తో సిరీస్‌లో ఆడారు కదా! మరి వాళ్లలో ఎంతమందికి గాయాలయ్యాయి. టీమ్‌ఇండియా ఆటగాళ్ల గాయాల గురించి పట్టించుకోవాల్సిన మేనేజ్‌మెంట్‌ సరిగా వ్యవహరించట్లేదన్నది వాస్తవం. ఆటగాళ్ల శరీరం ఎలా స్పందిస్తోంది.. అందుకు అనుగుణంగా చేయాల్సిన కసరత్తులు ఏమిటి.. అనే దిశగా ఫిజియోలు ఎలాంటి ఆలోచనలు చేయలేకపోయారు. ప్రాక్టీస్‌లో గాయపడి రాహుల్‌ స్వదేశానికి పయనం కావడం, 2019లో వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌ పాండ్య.. ఇంకా బౌలింగ్‌ వేసేందుకు తగ్గ ఫిట్‌నెస్‌ సాధించలేకపోవడం గమనార్హం. గాయాల కారణంగా జడేజా, షమి, ఉమేశ్‌, విహారిలను ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. ఓ మేటి జట్టుతో సిరీస్‌కు కీలక ఆటగాళ్లందరూ అందుబాటులో లేకపోవడం ప్రతికూలతే. ఆస్ట్రేలియాపై విజయం సాధించిన మత్తులో గాయాల సమస్యను తేలిగ్గా తీసుకోకుండా ఇక నుంచైనా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలో ఫిజియో బృందం మరింత దృష్టి సారించాల్సిందే.

ఇదీ చూడండి : ఆసీస్​ సిరీస్​లో గాయాలతో దూరమైన ఆటగాళ్లు వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.