ETV Bharat / sports

ఐపీఎల్: రోహిత్​సేన.. కొడుతుందా సిక్సర్‌! - ముంబయి ఇండియన్స్ బలహీనతలు

ముంబయి ఇండియన్స్​.. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టు. గత నాలుగేళ్లలో మూడుసార్లు విజేతగా నిలిచి దూకుడు చూపిస్తోంది. ఈ సీజన్​లోనూ కప్​ కొట్టాలని బలంగా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో చూద్దాం.

Mumbai Indians Strengths and weakness
ముంబయి ఇండియన్స్
author img

By

Published : Apr 7, 2021, 8:42 AM IST

'టీమ్‌ఇండియా కంటే ముంబయి ఇండియన్స్‌ జట్టే మెరుగ్గా ఉంది..'

'ఇంగ్లాండ్‌ ఓడింది భారత్‌ చేతిలో కాదు. ముంబయి ఇండియన్స్‌ చేతిలో..'

ఇటీవల భారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ సందర్భంగా ఇంగ్లీష్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఇక్కడ భారత క్రికెట్‌ జట్టును తక్కువ చేసి చూడడం ఉద్దేశం కాదు కానీ.. ముంబయి ఇండియన్స్‌ ఎంత బలమైన జట్టో చెప్పేందుకు ఆ వ్యాఖ్యలు నిదర్శనం. ఏ ఇద్దరో ముగ్గురో మ్యాచ్‌ విన్నర్లు ఉంటే.. దాన్ని పటిష్ఠమైన జట్టుగా భావిస్తారు. కానీ జట్టులో మొత్తం మ్యాచ్‌ విన్నర్లే ఉంటే.. దాన్నే ముంబయి ఇండియన్స్‌ అంటారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తిరుగులేని ఆధిపత్యంతో ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అలవోకగా సిక్సర్లు బాదే హిట్టర్లతో నిండి ఉన్న ఆ జట్టు.. ఈసారి కూడా విజేతగా నిలిచి టైటిళ్ల సిక్సర్‌పై కన్నేసింది.

Mumbai Indians Strengths and weakness
రోహిత్

ప్రతి ఐపీఎల్‌ సీజన్‌కు ముందు కొన్ని జట్లపై అంచనాలుంటాయి. కానీ ముంబయి ఇండియన్స్‌పై మాత్రం టైటిల్‌ గెలుస్తుందనే నమ్మకం ఉంటుంది. ఏ జట్టులోనైనా కీలక ఆటగాళ్లు ఇద్దరో ముగ్గురో ఉంటారు. కానీ జట్టంతా ప్రధాన ఆటగాళ్లతో నిండి ఉంటే అది కచ్చితంగా ముంబయి ఇండియన్స్‌ మాత్రమే అయి ఉంటుంది. లీగ్‌లో ఆ జట్టు ప్రస్థానం అద్భుతం. దాని ప్రయాణం అనితర సాధ్యం. మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఇప్పటివరకూ అత్యధికంగా అయిదు టైటిళ్లను సొంతం చేసుకుంది. 2013లో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు.. ఆ తర్వాత ఏడు సీజన్లలో నాలుగు సార్లు (2015, 2017, 2019, 2020) టైటిల్‌ దక్కించుకుంది. గత నాలుగు సీజన్లలో మూడుసార్లు ట్రోఫీ సొంతం చేసుకుని దూకుడు ప్రదర్శిస్తోంది. ఓ ఏడాది విజేతగా నిలిచాక.. ఆ తర్వాతి సీజన్‌లో విఫలమయ్యే సంప్రదాయానికి గతేడాది ముగింపు పలికిన జట్టు.. ఇప్పుడు వరుసగా మూడో సారి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది.

Mumbai Indians Strengths and weakness
ముంబయి ఇండియన్స్

బలాలు..

అన్ని రంగాల్లో పటిష్ఠమైన ముంబయి ఇండియన్స్‌ బలాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆ జట్టుకు తిరుగులేదు. బలమైన కోర్‌ బృందం ఆ జట్టుకు సొంతం. కొన్నేళ్లుగా ప్రధాన ఆటగాళ్లను కొనసాగిస్తున్న ఆ జట్టు అందుకు తగిన ఫలితాలు పొందుతూనే ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, డికాక్‌, ఇషాన్‌ కిషాన్‌, సూర్య కుమార్‌, పొలార్డ్‌, హార్దిక్‌, కృనాల్‌ పాండ్య.. ఇలా బ్యాటింగ్‌ విభాగంలోని ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ విన్నరే. రోహిత్‌, డికాక్‌ కలిసి జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇస్తే.. ఇషాన్‌, సూర్య తమ ధనాధన్‌ ఆటతీరుతో భారీ స్కోరుకు బాటలు పరుస్తారు. ఇక ఆల్‌రౌండర్లు పొలార్డ్‌తో పాటు పాండ్యా సోదరులు ఇన్నింగ్స్‌కు గొప్ప ముగింపునిస్తారు. ఇప్పుడు వీళ్లందరూ మంచి ఫామ్‌లో ఉండడం ప్రత్యర్థికి గుబులు పుట్టించే విషయం. ఈ బ్యాటింగ్‌ విభాగానికి దుర్భేద్యమైన పేస్‌ బౌలింగ్‌ తోడై జట్టును మరింత బలంగా మార్చుతుంది. ప్రపంచ అగ్రశ్రేణి పేస్‌ ద్వయం బుమ్రా, బౌల్ట్‌.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు గట్టి సవాళ్లు విసరగలరు. గత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన బుమ్రా (27), బౌల్ట్‌ (25) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ పేస్‌ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఈసారి వేలంలో కౌల్టర్‌ నైల్‌ (రూ.5 కోట్లు), ఆడమ్‌ మిల్నే (రూ.3.2 కోట్లు), నీషమ్‌ (రూ.50 లక్షలు)ను జట్టు తీసుకుంది. అలాగే రోహిత్‌ సారథ్యంతో పాటు ప్రధాన కోచ్‌ మహేల జయవర్ధనె, రాబిన్‌ సింగ్‌, షేన్‌ బాండ్‌, జహీర్‌ ఖాన్‌, సచిన్‌లతో కూడిన సహాయక బృందం ఆ జట్టుకు కొండంత బలం.

Mumbai Indians Strengths and weakness
ముంబయి ఇండియన్స్

బలహీనతలు..

స్పిన్‌ విభాగమే ఆ జట్టుకు బలహీనతగా మారుతోంది. జట్టులో ప్రధాన స్పిన్నర్లైన చాహర్‌, కృనాల్‌పై పూర్తి భరోసా పెట్టలేని పరిస్థితి. ఇటీవల ఇంగ్లాండ్‌తో సిరీస్‌ల్లో వాళ్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. మరో ఇద్దరు స్పిన్నర్లు జయంత్‌ యాదవ్‌, అనుకుల్‌పైనా అంచనాలు లేవు. అందుకే స్పిన్‌ విభాగాన్ని బలంగా మార్చుకోవడం కోసం ఈ సారి వేలంలో సీనియర్‌ బౌలర్‌ పీయూష్‌ చావ్లా (రూ.2.4 కోట్లు)ను తీసుకున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 156 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చావ్లా మూడో స్థానంలో ఉన్నాడు. మంచి జట్టును కలిగి ఉన్నప్పటికీ.. కీలక క్రికెటర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్లు లేకపోవడం జట్టుకు ఇబ్బంది పెట్టే అంశం. పేసర్‌ బుమ్రా ఆడలేని పరిస్థితి వస్తే అతని స్థానంలో మంచి ప్రదర్శన చేసే ఒక్క దేశీయ పేసర్‌ కూడా కనిపించడం లేదు.

Mumbai Indians Strengths and weakness
ముంబయి ఇండియన్స్

దేశీయ ఆటగాళ్లు: రోహిత్‌ (కెప్టెన్‌), బుమ్రా, ధావళ్‌ కులకర్ణి, సూర్యకుమార్‌ యాదవ్, కృనాల్ పాండ్యా‌, రాహుల్‌ చాహర్‌, హార్దిక్ పాండ్యా‌, అనుకుల్‌, పియూష్ చావ్లా‌, అన్మోల్‌ప్రీత్‌, మోసిన్‌ ఖాన్‌, యుధ్‌వీర్‌, ఇషాన్‌ కిషాన్‌, ఆదిత్య తారె, సౌరభ్‌ తివారి, జయంత్‌ యాదవ్‌, అర్జున్‌ తెందూల్కర్‌

విదేశీయులు: క్రిస్‌ లిన్‌, మిల్నే, మార్కో జాన్సెన్‌, పొలార్డ్‌, నీషమ్‌, బౌల్ట్‌, కౌల్టర్‌ నైల్‌, డికాక్‌

ఉత్తమ ప్రదర్శన

2013, 2015, 2017, 2019, 2020లో ఛాంపియన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.