ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​న​కు ఐపీఎల్​ సన్నద్ధత లాంటిది!'

author img

By

Published : Mar 10, 2021, 6:19 PM IST

Updated : Mar 10, 2021, 6:26 PM IST

ఐపీఎల్​ ఆడడం వల్ల రాబోయే టీ20 ప్రపంచకప్​కు ప్రాక్టీసులా ఉపయోగపడుతుందని అన్నాడు ఇంగ్లాండ్​ వికెట్​కీపర్​ సామ్​ బిల్లింగ్స్​. ఈ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు బిల్లింగ్స్​ ప్రాతినిధ్యం వహించనుండగా.. ఈ జట్టులో విదేశీ ఆటగాళ్ల స్థానాలకు పోటీ ఉన్నా, తనకు ఆడే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

IPL will help in T20 World Cup preparation, says Billings
సామ్​ బిల్లింగ్స్​

టీ20 ప్రపంచకప్​కు ఐపీఎల్​ సన్నద్ధత లాంటిదని ఇంగ్లాండ్​ వికెట్​కీపర్​ సామ్​ బిల్లింగ్స్​ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు బిల్లింగ్స్​ ప్రాతినిధ్యం వహించనున్నాడు. అయితే ఆ జట్టులో ఇప్పటికే విదేశీ ఆటగాళ్ల స్థానాలకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో.. తుదిజట్టులో తనకు స్థానం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

"దిల్లీ క్యాపిటల్స్​ జట్టులోని విదేశీ ఆటగాళ్లను పరిశీలిస్తే.. వారిలో ఏ కాంబినేషన్​లోనైనా గెలుపునకు అవకాశం ఉంది. గతేడాది జరిగిన టోర్నీలో దిల్లీ జట్టు అసాధారణమైన పోటీతో ఫైనల్​కు చేరింది. మరోవైపు ఐపీఎల్​ ఆడడం వల్ల టీ20 ప్రపంచకప్​కు సన్నద్ధమయ్యే అవకాశం లభించినట్లు అవుతుందని భావిస్తున్నా".

- సామ్​ బిల్లింగ్స్​, ఇంగ్లాండ్​ వికెట్​కీపర్​

యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు తొలిసారి ఫైనల్​కు చేరింది. అయితే తుదిపోరులో ముంబయి ఇండియన్స్​ జట్టుపై ఓటమిని ఎదుర్కొంది. గత సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున దక్షిణాఫ్రికా పేసర్లు కగిసో రబాడా, అన్రిచ్​ నార్ట్జే, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ మార్కస్​ స్టోయినిస్​, వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ షిమ్రాన్​ హెట్​మేయర్​ తుదిజట్టులో ఆడారు.

ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్​ స్క్వాడ్​లోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​ సహా ఇంగ్లాండ్​ ఆటగాళ్లు టామ్​ కరన్​, సామ్​ బిల్లింగ్​ వచ్చి చేరారు. 2016-17 మధ్య జరిగిన ఐపీఎల్​ సీజనల్లో సామ్​ బిల్లింగ్స్​ దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలోనే తొలిసారి రిషబ్​ పంత్​ ఆటతీరును గమనించినట్లు తెలిపాడు. "గతంలో దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో రిషబ్​ పంత్​తో కలిసి బ్యాటింగ్ చేశాను. అప్పుడే ఆ పిల్లవాడు ఎవరని రాహుల్​ ద్రవిడ్​ను అడిగాను" అని సామ్​ బిల్లింగ్స్​ అన్నాడు.

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​కు షెడ్యూల్​ ఖరారైంది. ఏప్రిల్​ 9 నుంచి మే 30 వరకు టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అహ్మదాబాద్​ వేదికగా టోర్నీలో జరగనున్న తొలిమ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​తో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు టీమ్​ తలపడనుంది.

ఇదీ చూడండి: 'టీ20 ప్రపంచకప్​లో భువనేశ్వర్​ కీలకం'

Last Updated : Mar 10, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.