ETV Bharat / sports

ఐపీఎల్​ వేలం కోసమే ముస్తాక్​​ అలీ టోర్నీ నిర్వహణ! - రంజీ ట్రోఫీ కంటే ముందు ముష్తాక్​ అలీ టోర్నీ

ఐపీఎల్​ కొత్త సీజన్​ వేలాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్తాక్​​ అలీ టీ20 టోర్నీని జనవరిలో నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మూడు మైదానాలతో పాటు హోటల్​ సదుపాయాలు కలిగిన రాష్ట్ర సంఘాలతో బోర్డు సంప్రదింపులు జరుపుతోందని ఓ రాష్ట్ర యూనిట్​ అధికారి వెల్లడించారు.

IPL auctions in mind, BCCI may have Mushtaq Ali T20 before Ranji Trophy
ఐపీఎల్​ వేలం కోసమే ముష్తాక్​ అలీ టోర్నీ నిర్వహణ!
author img

By

Published : Nov 16, 2020, 9:32 AM IST

ఐపీఎల్​ 14వ సీజన్​ను దృష్టిలో ఉంచుకొని జనవరిలో సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీని నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. కనీసం మూడు జట్లతో బయో-బబుల్​ వాతావరణాన్ని సృష్టించడానికి బహుళ మైదానాలతో పాటు ఆటగాళ్ల కోసం హోటళ్లున్న కొన్ని రాష్ట్ర క్రికెట్​ సంఘాలను బీసీసీఐ పరిశీలిస్తుంది.

"అవును, ఈ ఏడాది ఐపీఎల్​ వేలంలో ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికి తీసేందుకు, ముందుగా ముస్తాక్​ అలీ ట్రోఫీని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫైవ్​స్టార్​ సదుపాయాలు కలిగి ఉన్న హోటళ్లకు కనీసం మూడు మైదానాలు ఉన్న రాష్ట్ర యూనిట్లను బీసీసీఐ పరిశీలిస్తుంది. కనీసం 10 రాష్ట్ర యూనిట్లను సంప్రదించి.. వారు బయో-బబుల్​ వాతావరణాన్ని సృష్టించగలరా అని అడిగి తెలుసుకుంటారు. పదింటిలో ఆరు సంఘాల నుంచి సానుకూల స్పందన వచ్చినా.. ముస్తాక్​​ అలీ టోర్నీని రెండు వారాల్లోనే పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తుంది. దీంతో పాటు రంజీ ట్రోఫీని ప్రారంభించే అవకాశం ఉంది" అని ఓ రాష్ట్ర యూనిట్​ అధికారి వెల్లడించారు.

IPL auctions in mind, BCCI may have Mushtaq Ali T20 before Ranji Trophy
ఐపీఎల్​ వేలం (పాత చిత్రం)

బెంగాల్​ అసోసియేషన్​ సరైనది..

ముస్తాక్​ అలీ జాతీయ టీ20 ఛాంపియన్​షిప్​కు క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బెంగాల్​ (సీఏబీ) ఆధ్వర్యంలోని ఈడెన్​ గార్డెన్స్​, జేయూ (సాల్ట్​ లేక్​), కల్యాణి అనే మూడు మైదానాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బయో-బబుల్​ సృష్టించగల సామర్థ్యాన్ని తనిఖీ చేయడానికి సీఏబీ సరైన ఎంపిక అని క్రికెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముస్తాక్​ అలీ టీ20 టోర్నీలో పాల్గొనబోతున్న ఆరు జట్లతో బయో-బబుల్​ ఏర్పాటు చేయడానికి రెండు హోటళ్లను బుక్​ చేసినట్లు సీఏబీ అధికారి ఒకరు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.