ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: రికార్డు సృష్టించిన మోరిస్, మెరెడిత్, కృష్ణప్ప

ఐపీఎల్ వేలం హోరాహోరీగా సాగుతోంది. ఆటగాళ్లను కొనుక్కోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈసారి వేలంలో కొన్ని నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొందరు ఊహించినట్లుగా భారీ ధర పలకగా, మరికొందరు రికార్డు ధరతో షాకిచ్చారు.

IPL Auction
ఐపీఎల్ వేలం
author img

By

Published : Feb 18, 2021, 7:16 PM IST

ఈసారి ఐపీఎల్‌ వేలం ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్కంఠతో సాగుతోంది. గతేడాది ఆటగాళ్ల ప్రదర్శనలను ఫ్రాంచైజీలు దృష్టిలో పెట్టుకోలేదు. ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచారు. అందుకే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లకు కూడా అనూహ్య ధర పలికింది. అందులో మోరిస్‌, మ్యాక్స్​వెల్, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, షకిబ్‌ ముందు వరుసలో ఉన్నారు.

చరిత్ర సృష్టించిన మోరిస్

దక్షిణాఫ్రికా పేస్ ఆల్​రౌండర్ క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ రికార్డును తిరగరాశాడు. గత సీజన్‌లో ఇతడికి బెంగళూరు తరఫున కొన్ని మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచుల్లోనూ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాలందించాడు. మెరుపువేగంతో బంతులు వేసే మోరిస్‌ జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్స్‌మన్‌గా మారి భారీ సిక్సర్లు కూడా కొట్టగలడు. అయితే.. గతేడాది బెంగళూరు మోరిస్‌ను వదులుకోవడం వల్ల ఈసారి వేలంలోకి వచ్చాడు. కాగా.. రూ.75లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన మోరిస్‌ను రాజస్థాన్‌ జట్టు ఏకంగా రూ.16.25కోట్లు కుమ్మరించి సొంతం చేసుకుంది. మోరిస్‌ కోసం ముంబయి, పంజాబ్‌, రాజస్థాన్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే.. రాయల్స్‌ ఎక్కడా వెనకడుగు వేయకపోవడం వల్ల మోరిస్‌పై ఆ జట్లు ఆశలు వదులుకోక తప్పలేదు.

IPL Auction
మోరిస్

జేమిసన్‌కు రికార్డు ధర..

న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జేమిసన్‌ని బెంగళూరు రూ.15కోట్లకు దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను న్యూజిలాండ్‌ జాతీయ జట్టులో చేరింది 2020 ఫిబ్రవరిలో. ఇప్పటివరకు 6 టెస్టుల్లో 36 వికెట్లు తీశాడు. వైట్‌బాల్‌తోనూ వికెట్లు తీయడంలో దిట్ట.

సిక్సర్‌ కొట్టకపోయినా జాక్‌పాట్‌ కొట్టాడు

అసలైన జాక్‌పాట్‌ అంటే మ్యాక్స్​వెల్​దే. గత సీజన్‌లో ఒక్క సిక్సర్‌ కొట్టలేకపోయిన ఈ ఆస్ట్రేలియన్‌ పించ్‌ హిట్టర్ ఈసారి వేలంపాటలో ఏకంగా భారీ బౌండరీ బాదాడు. గతేడాది పంజాబ్‌ తరఫున ఆడిన మ్యాక్సీ కనీసం ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో పంజాబ్‌ యాజమాన్యం అతడిని వదులుకుంది. దీంతో మ్యాక్స్​వెల్​కు ఈసారి తక్కువ ధర పలకడం ఖాయమని చాలామంది భావించారు. కానీ.. ఈసారి ఇతడి కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోరాడాయి. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన ఈ పోరులో చివరికి బెంగళూరు పైచేయి సాధించింది. ఏకంగా రూ.14.25కోట్లు పెట్టి బెంగళూరు మ్యాక్స్​వెల్​ను సొంతం చేసుకుంది.

IPL Auction:
మ్యాక్స్​వెల్

రిచ్‌గా.. రిచర్డ్‌సన్‌

మరో ఆస్ట్రేలియన్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ మెరిశాడు. పంజాబ్‌ జట్టు ఏకంగా రూ.14కోట్లు పెట్టి ఈ యువ స్పీడ్‌గన్‌ను సొంతం చేసుకుంది. రిచర్డ్‌సన్‌ను దక్కించుకోవడానికి దిల్లీ, బెంగళూరు, ముంబయి చివరివరకూ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియన్‌ టీ20 స్పెషలిస్టు మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ ఆ స్థానంలో రిచర్డ్‌సన్‌ను కొనుక్కోవడం విశేషం.

ఖరీదైన ఆటగాడిగా కృష్ణప్ప రికార్డు

2019లో రాజస్థాన్‌ తరఫున ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కర్ణాటక స్పిన్‌ ఆల్‌రౌండర్‌.. గతేడాది పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు కృష్ణప్పను వదులుకుంది. తాజాగా.. జరిగిన వేలంలో అతడికి ఊహించని విధంగా ధర లభించింది. చెన్నై జట్టు ఏకంగా రూ.9.25 కోట్లు కృష్ణప్పను సొంతం చేసుకుంది. రూ.20లక్షల కనీస ధరతో అతను వేలంలోకి రావడం గమనార్హం. కాగా.. భారత జట్టు సభ్యుడు కాకుండానే ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా కృష్ణప్పగౌతమ్‌ రికార్డు సృష్ష్టించాడు. గతంలో కృనాల్ పాండ్యాను రూ.8.8 కోట్లకు ముంబయి దక్కించుకుంది.

IPL Auction
గౌతమ్

ఆస్ట్రేలియన్‌ పేసర్‌ మెరెడిత్‌ రికార్డు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మ్యాక్స్​వెల్​ను వదులుకున్న పంజాబ్‌ జట్టు మళ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. యువ పేసర్‌ మెరెడిత్‌ను ఏకంగా రూ.8కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అతడి కోసం దిల్లీ, పంజాబ్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి దిల్లీ వెనక్కి తగ్గింది. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ విదేశీ క్రికెటర్​కు ఇంత ధర దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు జోఫ్రా ఆర్చర్​ 7.2 కోట్లకు అమ్ముడయ్యాడు.

IPL AuctioIPL Auctionn
మెరిడిత్

షాకిచ్చిన షారుక్ ఖాన్‌

తమిళనాడుకు చెందిన యువ బ్యాట్స్‌మన్‌ షారుక్ ఖాన్‌ అందరికీ షాకిచ్చాడు. అరంగేట్రంలోనే అతడు కోటీశ్వరడయ్యాడు. రూ.20లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన షారుక్​ను పంజాబ్‌ యాజమాన్యం ఏకంగా రూ.5.25కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అతడు అండర్‌19 ప్రపంచకప్‌, సయ్యద్‌ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో మెరుపులు మెరిపించి అందరి దృష్టి అకర్షించాడు.

ముంబయికి కౌల్టర్‌నైల్‌

రూ.1.5కోట్లతో అందుబాటులోకి వచ్చిన ఆస్ట్రేలియన్‌ పేసర్‌ కౌల్టర్‌నైల్‌ను ముంబయి దక్కించుకుంది. అతడి కోసం ముంబయి, దిల్లీ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ముంబయి రూ.5కోట్లిచ్చి గూటిలో చేర్చుకుంది.

మొయిన్‌ తిప్పేశాడు

ఇంగ్లాండ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ గతేడాది బెంగళూరు తరఫున అటు బ్యాటుతోగానీ.. ఇటు బంతితోగానీ పెద్దగా రాణించింది లేదు. దీంతో బెంగళూరు యాజమాన్యం మొయిన్‌ అలీని వదులుకుంది. కాగా.. అనుభవానికి పెద్దపీట వేసే చెన్నై మొయిన్‌పై నమ్మకం ఉంచింది. రూ.7కోట్లు ఖర్చు చేసి దక్కించుకుంది.

పాత గూటికి షకిబుల్

నిషేధం కారణంగా గత సీజన్‌కు దూరమైన బంగ్లాదేశ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షకిబుల్‌ హసన్‌కు కూడా మంచి ధర పలికింది. కోల్‌కతా జట్టు అతడిని రూ.3.2కోట్లు పెట్టి కొనుక్కొంది. గతంలోనూ షకిబ్‌ కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎన్నో మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించాడు. అందుకే ఈ బంగ్లాటైగర్‌ను కోల్‌కతా మళ్లీ ఆహ్వానించింది.

దూబేకు భారీ ధర..

అందరూ ఊహించినట్లుగానే భారత యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు డిమాండ్‌ బాగా పెరిగింది. గతేడాది కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి రాజస్థాన్‌ జట్టు రూ.4.4కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

కాగా.. టీ20ల్లో ప్రపంచ నం.1 బ్యాట్స్‌మన్‌గా ఉన్న ఇంగ్లాండ్‌ హిట్టర్‌ డేవిడ్‌ మలన్‌కు కేవలం రూ.1.5కోట్లే దక్కింది. పంజాబ్‌ జట్టు అతడిని కొనుగోలు చేసింది. చెన్నై తరఫున అత్యంత పేలవ ప్రదర్శన చేసిన కేదార్‌ జాదవ్‌ను ఎవరూ కొనుక్కోకపోవడం గమనార్హం. అలాగే టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు పుజారాను కనీస ధర రూ 50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.