ఐపీఎల్ మ్యాచ్‌లపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముంబయిలో మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌తో పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఒక్క రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఐపీఎల్లో ప్రేక్షకులకు అనుమతి లేనందున మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతిచ్చాం. లీగ్‌లో పాల్గొనే వారు ఒకే చోట స్వీయ నిర్బంధంలో ఉండాలి."
-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి.
"చాలా మంది ఆటగాళ్లకు టీకా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీసీఐ కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది. రాష్ట్రంలో చాలా మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలుసు. వయోపరిమితిని తగ్గించాలని కేంద్రాన్ని కోరాం. కానీ వారు అనుమతి ఇవ్వకుండా మేమే పని చేయలేం" అని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత హుబెర్ట్